‘నా పేరు సూర్య’ స్పెషల్ షోలకు ఏపీ, తెలంగాణలో అనుమతి... టైమింగ్స్ ఇవే!

By Bojja Kumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య' మే 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. డిమాండుకు తగిన విధంగా మొదటి వారం స్పెషల్ షోలు వేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుండి అనుమతి అభించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'నా పేరు సూర్య' స్పెషల్ షోలు వేసుకునేందుకు మే 4వ తేదీ నుండి మే 11వ తేదీల మధ్య తెల్లవారు ఝామున 5 గంలటల నుండి 10 గంటల మధ్య ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Naa Peru Surya gets permission for its special morning shows

ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజూ 5 షోలకు అనుమతి ఇచ్చింది. మే 4 నుండి మే 11 మధ్య ఉదయం 7 గంటల తర్వాత ఈ అదనపు షో ప్రదర్శించే అవకాశం ఉందని అంటున్నారు. ఈమేరకు హైదరాబాద్‌లో భారీగా స్పెషల్ షోలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Naa Peru Surya gets permission for its special morning shows

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ - రామ్ లక్ష్మణ్
సాహిత్యం - , సీతారామ శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి
సంగీతం - విశాల్ - శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు
బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ - k.నాగబాబు
సహ నిర్మాత - బన్నీ వాసు
నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X