twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియమణి ఉండగానే ఆమె కోసం ప్రయత్నాలు.. ఫైట్ చేస్తున్న వెంకటేష్

    |

    విక్టరీ వెంకటేష్ 'నారప్ప'గా సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే చిత్రానికి సంబంధించి వినిపిస్తున్న కొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. వివరాల్లోకి పోతే..

    అసురన్ తెలుగు రీమేక్.. రంగంలోకి సురేష్ బాబు

    అసురన్ తెలుగు రీమేక్.. రంగంలోకి సురేష్ బాబు

    తమిళంలో సూపర్ డూపర్ సాధించిన 'అసురన్' సినిమానే తెలుగులో 'నారప్ప' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ధనుష్, మంజు వారియర్ జంటగా రూపొందిన ఈ సినిమా అసురన్ మూవీ 2019 సంవత్సరంలో విడుదలై 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో ఈ మూవీ రీమేక్ హక్కులను సురేష్ బాబు తీసుకున్నారు.

    వెంకీ ఉగ్రరూపం.. ఊరమాస్ గెటప్స్

    వెంకీ ఉగ్రరూపం.. ఊరమాస్ గెటప్స్

    ఈ రీమేక్ లో వెంకటేష్‌ను హీరోగా కన్ఫర్మ్ చేస్తూ ఇటీవలే ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. 'నారప్ప' టైటిల్ సహా వెంకీ ఊరమాస్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉగ్రరూపం దాల్చుతున్న వెంకటేష్ పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్‌ప్రైజ్ చేశారు. అలాగే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సెట్స్ పైకి వచ్చేసింది.

    తొలి షెడ్యూల్ షూటింగ్.. ఫైట్స్ సీన్స్

    తొలి షెడ్యూల్ షూటింగ్.. ఫైట్స్ సీన్స్

    కొద్దిరోజులపాటు ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ అనంతపురంలో పరిసర ప్రాంతాల్లో పూర్తిచేశారు. ఇక ఇప్పుడు తమిళ నాడు లోని కురుమలైలో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప' కి సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్స్ సీన్స్ పూర్తయ్యాక తిరిగి అనంతపురంలో షెడ్యూల్ కంటిన్యూ చేయనున్నారు.

    ప్రియమణి ఉండగానే ఆమె కోసం ప్రయత్నాలు

    ప్రియమణి ఉండగానే ఆమె కోసం ప్రయత్నాలు

    ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కీలక పాత్ర కోసం హీరోయిన్ అమలా పాల్‌ను కూడా తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారట దర్శకనిర్మాతలు. ఈ మేరకు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా నడిచాయని త్వరలోనే ఆమె కూడా సెట్స్ పైకి రానుందని తెలుస్తోంది.

    'నారప్ప' మూవీ విశేషాలు

    'నారప్ప' మూవీ విశేషాలు

    సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా 'నారప్ప' మూవీ నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం సమకూరుతుతున్నారు. సినిమాటోగ్రఫీ సామ్‌.కె నాయుడు అందిస్తుండగా.. లిరిక్స్‌ సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం రాస్తున్నారు. ఈ సమ్మర్‌లో నారప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Tamil Sensational movie Asuran Will remake on telugu as NAARAPPA. This movie regular shoot is going on. Now in this movie heroine Amala Paul for major role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X