‘నారప్ప’కు కష్టాలు.. అందుకే అక్కడికి జంప్
తమిళ సెన్సేషన్ అసురన్ చిత్రాన్ని తెలుగులో నారప్పగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో ధనుష్ హీరోగా వచ్చిన ఈ మూవీ రికార్డులను బద్దలు కొట్టేసింది. ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు నమోదు చేసింది. అలాంటి సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు.
నారప్ప షూటింగ్‌ను అట్టహాసంగా ప్రారంభించి.. అదే రోజు వెంకటేష్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. నారప్పగా వెంకీ లుక్స్ సోషల్ మీడియాలో ఎంత పెద్ద రచ్చ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ కోలీవుడ్ ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలి.. ట్విట్టర్‌లో మాటల యుద్దం చేశారు. అదంతే పక్కన పెడితే.. నారప్పకు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.

నారప్ప షూటింగ్‌ను అనంతరపురంలోని ఓ గ్రామంలో చిత్రీకరిస్తున్నారని తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్‌కు కుప్పులు తెప్పలుగా జనాలు రావడంతో షూటింగ్‌కు ఇబ్బంది కలగడం, ఫోన్‌లో సీన్స్‌ను చిత్రీకరించడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయట. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. అందుకే ఈ తలనొప్పులంతా ఎందుకని షూటింగ్‌ను తమిళనాడులోని ఓ కుగ్రామానికి షిఫ్ట్ చేశారట. దాదాపు నెల రోజుల పాటు అక్కడే షూటింగ్ జరగబోతోందని తెలుస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ప్రియమణి, అమలాపాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











