twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ 'నాయక్‌'బడ్జెట్..ఎవరికి ఎంతెత?(ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'నాయక్‌'. కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. సంక్రాంతి కాకుకగా విడుదల అవుతున్న ఈ చిత్రంపై హై ఎక్సపెక్టేషన్స్ ఇటు ప్రేక్షకులలోనూ,అటు ట్రేడ్ లోనూ ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ అయ్యింది..ఎవరికి ఎంతెంత ఇచ్చారు..బిజినెస్ పొజీషన్ ఏమిటి వంటి విషయాలు అన్ని చోట్లా చర్చకు వస్తున్నాయి. ట్రేడ్ లో వినపడతున్న ప్రకారం...(అఫీషియల్ లెక్కలు కాదు)

    రామ్ చరణ్ 'నాయక్‌'బడ్జెట్..ఎవరికి ఎంతెత?(ఫోటో ఫీచర్)

    హీరో రామ్ చరణ్ కి తొమ్మిది కోట్లు రెమ్యునేషన్ అందచేసారని తెలుస్తోంది. సంఘ విద్రోహులకు ఎదురు తిరిగే యువకుడిగా ఈ చిత్రంలో రామ్ చరణ్‌ పాత్ర ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. వినాయక్‌ శైలిలో మాస్‌, యాక్షన్‌ అంశాల్ని మేళవించారు.

     రామ్ చరణ్ 'నాయక్‌'బడ్జెట్..ఎవరికి ఎంతెత?(ఫోటో ఫీచర్)

    దర్శకుడు వినాయిక్ తొలిచిత్రం ఆది నుంచి యాక్షన్ చిత్రాలనే నమ్ముకున్న వినాయిక్,కృష్ణ,అదుర్స్ తో రూట్ మార్చి ఎంటర్టైన్మెంట్ ని సైతం కలుపుతున్నారు. ఇలా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. దాంతో వినాయిక్ రెమ్యునేషన్ హీరోని మించి ఈ చిత్రానికి 11 కోట్లు అని తెలుస్తోంది.

    రామ్ చరణ్ 'నాయక్‌'బడ్జెట్..ఎవరికి ఎంతెత?(ఫోటో ఫీచర్)

    మెయిన్ హీరోయిన్ కాజల్ ..తన రెమ్యునేషన్ కోటి రూపాయలు,రెండవ హీరోయిన్ అమలా పాల్ అయితే అరవై లక్షలు దాకా వసూలు చేసారని తెలుస్తోంది. వీటితో పాటు బ్రహ్మానందం వంటి సీనియర్స్ రెమ్యునేషన్స్ కూడా కలుపుకుంటే...నాలుగు కోట్లు దాకా ఖర్చు అయ్యిందని వినికిడి.

     రామ్ చరణ్ 'నాయక్‌'బడ్జెట్..ఎవరికి ఎంతెత?(ఫోటో ఫీచర్)

    సినిమాని భారీగా కలకత్తా వంటి లొకేషన్స్ లో స్పెషల్ సెట్స్ వేసి మరీ తీస్తున్నారు. పాటలకు విదేశాలు వెళ్లారు. అలా ప్రొడక్షన్ కాస్ట్ ...దాదాపు 19 కోట్లు దాకా వెళ్లిందని సమాచారం. అయితే సినిమా తెరపై రిచ్ గా...పెట్టిన ప్రతీ పైసా కనిపిస్తుందని దర్శక,నిర్మాతలు ధీమాగా ఉన్నారు.

    రామ్ చరణ్ 'నాయక్‌'బడ్జెట్..ఎవరికి ఎంతెత?(ఫోటో ఫీచర్)

    అన్ని విభాగాలు కలుపుకుని మొత్తం 42 కోట్లు దాకా బడ్జెట్ అవుతోందని చెప్పబడుతున్న ఈ చిత్రంలో చరణ్‌ పాత్ర రెండు విభిన్నమైన కోణాల్లో సాగుతుంది.నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొన్న ఓ యువకుడి కథ ఇది.

     రామ్ చరణ్ 'నాయక్‌'బడ్జెట్..ఎవరికి ఎంతెత?(ఫోటో ఫీచర్)

    'శుభలేఖ రాసుకొన్నా...' గీతాన్ని రీమిక్స్‌ చేశాం. ఆ పాటలోని లొకేషన్లు అబ్బురపరుస్తాయి. తమన్‌ మంచి బాణీలను అందించారు.

     రామ్ చరణ్ 'నాయక్‌'బడ్జెట్..ఎవరికి ఎంతెత?(ఫోటో ఫీచర్)

    ఈ పాత్ర గురంచి రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్‌ ద్వారా అతని ఇమేజ్‌కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్‌చరణ్‌ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము'' అన్నారు.

     రామ్ చరణ్ 'నాయక్‌'బడ్జెట్..ఎవరికి ఎంతెత?(ఫోటో ఫీచర్)

    జిలేబి పాత్రలో బ్రహ్మానందం కనిపించే ఈ చిత్రంలో వినోదం, యాక్షన్‌... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది. మగధీర' తర్వాత కాజల్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రమిదే. ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది.

    English summary
    Time when heroes are paid high remuneration than any other technicians for a Tollywood flick but its a different scene when it comes to Ramcharan’s Naayak movie under VV.Vinayak direction. Generally Hero gets the highest pay check as remuneration but for Naayak movie director VV.Vinayak surpassed Ramcharan’s remuneration that shows his demand as director in the industry. VV.Vinayak (director) – 11 crore, Ramcharan (hero)- 9 crore, Heroines & other artists – 4 crore,Cinema Production cost – 18 crore,
 Total budget –42 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X