మెగా మేనల్లుడితో నభా నటేష్ రొమాన్స్! ఇదీ అసలు విషయం
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గ్లామర్ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది నభా నటేష్. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచేసి వెండితెర విందు ఇచ్చింది నభా. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ దర్శకనిర్మాత చూపు ఆమెపై పడింది. ఈ నేపథ్యంలోనే నభా నటేష్ తాజాగా మెగా మేనల్లుడితో రొమాన్స్ చేసే ఛాన్స్ పట్టేసింది తెలుస్తోంది.
గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలన్నింటిపై స్పెషల్ కేర్ తీసుకుంటూ ఈ ఏడాది భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ మేరకు కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా చేస్తే బాగుంటుందని సూచించాడట సాయి ధరమ్. ఆయన సూచనా మేరకు చిత్రయూనిట్ నభా నటేష్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రతిరోజూ పండుగే' సినిమాతో బిజీగా ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే నవంబర్ నెలలో సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నాడట ఈ మెగా మేనల్లుడు. దీంతో పాటు దేవాకట్టా దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. మొత్తంగా చూస్తే 2020 సంవత్సరంలో సాయి ధరమ్ తేజ్ సినిమాల పండగ రానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











