ఈవెంట్ మేనేజర్ గా నాగార్జున..కథేమిటంటే...

By Srikanya

హైదరాబాద్ : నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున ఈవెంట్ మేనేజర్ గా కనిపించనున్నారని సమాచారం. అలాగే హీరోయిన్ నయనతారది పిల్లల వైద్యనిపుణురాలి పాత్ర. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు యువతరాన్ని ఓ రేంజ్‌లో అలరిస్తాయని చెప్తున్నారు. మన్మధుడు చిత్రం తరహాలో సీన్స్ ఫన్నీగా ఉంటాయని అంటున్నారు.

కథ ప్రకారం..ఈవెంట్ మేనేజర్ గా చేస్తున్న నాగార్జున...అక్కడ ఓ ఈవెంట్ లో భారీగా దెబ్బతినటంతో ఇండియాలో ఉన్న తన ఆస్తిని అమ్మి రికవరీ చేసుకుందాని వస్తారు. ఈ జర్నిలో నయనతార పరచయమవుతుంది. అక్కడనుంచి ఆమెతో నాగార్జున పరిచయం ఎలా ముందుకెళ్లింది. డబ్బే లోకంగా బ్రతికే నాగార్జున...కుటుంబ విలువలు,ప్రేమ వంటివాటికి ప్రయారిటి ఇవ్వాలని ఎలా తెలుసుకున్నాడు వంటి విషయాలతో సినిమా నడుస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

ఈ చిత్రం 12 రోజుల టాకీ మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు మిగిలిన టాకీని పూర్తి చేస్తారని తెలిసింది. ఇందులో ఉండే ఆరు పాటల్లో అయిదు పాటల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన ఒక్క పాటను నాగ్, నాయనతారపై త్వరలోనే చిత్రీకరించనున్నారు.

హైదరాబాద్, యూరప్, అమెరికా, బ్యాంకాక్ లాంటి అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాకు 'లవ్‌స్టోరీ' అనే టైటిల్‌ని నిర్ణయించినట్లుగా గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడేమో... 'సరిలేరు నీకెవ్వరూ' అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు టైటిల్సూ కాదని, ఈ వారంలోనే అసలు టైటిల్‌ని ప్రకటిస్తారని సమాచారం.

దశరథ్, నాగార్జున కాంబినేషన్‌లో పదకొండేళ్లక్రితం వచ్చిన 'సంతోషం' చిత్రం మించి ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. చాలాకాలం తర్వాత నాగ్ ప్రేమకథలో నటించటం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X