ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ : ప్రభాస్ సరసన ఆ బ్యూటీ.. అదిరిపోయే ప్లాన్ వేసిన నాగ్ అశ్విన్
ఇండియన్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినా, రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌కు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. ప్రభాస్ సినిమా వస్తోందంటే.. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాలు కూడా ఆసక్తి కనబరుస్తుంటాయి. అంతటి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ప్రభాస్ సాహో సినిమాతో అందరి అంచనాలను అందుకోలేకపోయాడు. అయినా సరే ప్రభాస్ రేంజ్ వల్ల కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

త్వరలోనే అప్‌డేట్..
ప్రభాస్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ అప్‌డేట్ కావాలి మొర్రో అంటూ గత కొన్ని రోజులుగా అడుగుతూనే ఉన్నారు. అందుకే హైద్రాబాద్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోందని ప్రభాస్ చేత చెప్పించారు. ఫస్ట్ లుక్ లాంటిది ఇవ్వండని ఎన్నో రోజుల నుంచి అడుగుతుండగా.. ఆ సమయం వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఉగాది సందర్భంగా ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ రాబోతోన్నట్లు తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో..
ప్రభాస్ 21వ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా జరిగిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ కథపై ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. ఈ కథను ప్రభాస్ ఒక్కడే మోయగలడని నాగ్ అశ్విన్ అన్న కామెంట్స్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
Recommended Video


బాలీవుడ్ హీరోయిన్‌ను దింపిన దర్శకుడు..
ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ అంటూ కామెంట్ చేసిన దర్శకుడు.. ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభాస్ పక్కన కత్రినా కైఫ్‌ను తీసుకున్నట్లు సమాచారం. కత్రినా ఉంటే బాలీవుడ్ మార్కెట్ కూడా బాగా వర్కౌట్ అవుతుందన్న ఉద్దేశ్యంతో ఆమెను తీసుకోబోతోన్నట్లు టాక్. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్‌తో రొమాన్స్ చేసిన ప్రభాస్.. కత్రినాతో కూడా ఆడిపాడేందుకు రెడీ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











