కల్కి2 రిలీజ్ డేట్.. కన్ఫమ్ చేసిన నాగ్ అశ్విన్.. ఎప్పుడంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. ఆయన లైనప్ లో ఎన్ని చిత్రాలున్నాయో డార్లింగ్ కే తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభాస్ కోసం ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్లు వెయిటింగ్ లో ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం తన చిత్రాలను చాలా సెలెక్టివ్ గా చేస్తూ వస్తున్నారు. సినిమా సినిమాకు మరింత రేంజ్ కు ఎదుగుతున్నారు. ఇప్పటికే బాహుబలి ఇమేజ్ ను దాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న డార్లింగ్.. ఇప్పుడు తన రాబోయే చిత్రాలతో వరల్డ్ మార్కెట్ ను శాసించాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు.
అయితే ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా, బాహుబలి రికార్డులను తిరగరాసే ప్రాజెక్ట్ ఏదైనా ప్రభాస్ లైనప్ లో ఉందంటే అది 'కల్కి' చిత్రమనే అంటున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ సినిమాను మైథాలాజీ, సైన్స్ ఫిక్షన్ మిళితంగా తెరకెక్కించారు. ఓవైపు కర్ణుడు, అశ్వాథామల బలాబలాలను చూపిస్తూనే మరోవైపు కల్కి ఆగమననాన్ని చూపించారు. ఇక కల్కి జననం ఎప్పుడు? ఆ తర్వాత ఏం జరుగుతుంది. సీరమ్ తో వచ్చిన శక్తితో సుప్రీమ్ యాస్కిన్ ఏం చేయబోతున్నారనేది కల్కి2కు వాయిదా పడింది. అయితే ఈ సినిమా కథకు వరల్డ్ మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉంది.

కల్కి 2898 ఏడీ చిత్రాన్ని 2024 జూన్ 27న విడుదల చేసి ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. మరోవైపు రూ.1100 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసి మతులు పోగొట్టారు. ఇక ఇప్పుడు కల్కి 2 షూటింగ్ పై నాగ్ అశ్విన్ దృష్టి పెట్టారు. త్వరలో షూటింగ్ ను కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ప్రభాస్ కల్కి 2 రిలీజ్ డేట్ పై ఫన్నీగా స్పందించారు... గతంలో కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ కావాంటే 3 లేదా 4 గ్రహాలు కలిసిపోవాలని చెప్పాను. ఇక కల్కి 2 విడుదల కావాలంటే కనీసం 7 నుంచి 8 గ్రహాలు కలిసిపోవాలన ఫన్నీగా బదులిచ్చాడు... అయితే దీని వెనకాల నాగ్ అశ్విన్ ఉద్దేశం ఇదేనని అంటున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం 7 నుంచి 8 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, కన్నప్ప, జటాయు, సలార్ 2, ప్రశాంత్ వర్మతో ఒక ప్రాజెక్ట్, లోకేష్ కనగరాజ్ తో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారనేది తెలిసిందే. నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ లైనప్ ను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ డేట్ పై అలా స్పందించారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలన్నీంటి తర్వాత కల్కి2 ను తీసుకొస్తారా? లేకా ముందే తీసుకొస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది.
అయితే, మరి కొద్దిరోజుల్లో మాత్రం నాగ్ అశ్విన్ కల్కి2 షూటింగ్ ను ప్రారంభించే పనిలో నిమగ్నమై ఉన్నారని తెలుస్తోంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు కల్కి2 ఆలస్యమైతే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తో ఓ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయబోతున్నారని కూడా అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.


Click it and Unblock the Notifications











