రెడీ అవుతున్న నాగ్ అశ్విన్.. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు!

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా మారాడు నాగ్ అశ్విన్. నాని హీరోగా, విజయ్ దేవరకొండ ప్రత్యేక పాత్రలో నటించిన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా నాగ్ అశ్విన్ అభిరుచిని చాటి చెప్పింది. ఆపై మహానటి సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు.

మహానటితో దర్శకుడిగా ఓ గౌరవాన్ని సంపాదించుకున్నాడు. మహానటి సావిత్రికి నిజమైన నివాళిగా 'మహానటి'ని తెరకెక్కించాడని సినీ ప్రముఖులు కొనియాడారు. అంతటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ మళ్లీ పత్తా లేకుండా పోయాడు. అయితే ఇన్నాళ్లకు ఆయనలో కదలికి వచ్చిందని, త్వరలోనే ఓ చిత్రం పట్టాలెక్కబోతోందని సమాచారం.

 Nag Ashwin New movie May Start In 2020 Summer

చిరంజీవి కోసం అశ్విన్ ఓ క‌థ త‌యారు చేస్తున్నాడ‌ని అప్ప‌ట్లో చెప్పారు. అయితే ఆ మాట ప్ర‌క‌ట‌న‌ల‌ వరకే ప‌రిమితమైంది. చిరంజీవితో సినిమా అనే ఆలోచ‌న ప‌క్క‌న పెట్టి త‌న స్క్రిప్టు ప‌నుల్లో బిజీగా ఉన్నాడనీ.. ఇప్పుడు ఆ ప‌నుల‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చాయని తెలుస్తోంది.

నాగ అశ్విన్ ఓ క‌థ‌ని రెడీ చేసేశాడు.. నాని, శ‌ర్వానంద్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ వంటి వారిలో ఎవరో ఒక‌రిని ఫిక్స్ చేసే అవ‌కాశాలున్నాయని వినికిడి. ఏప్రిల్ గానీ మే నెలలో నాగ అశ్విన్ సినిమా ప‌ట్టాలెక్కుతుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X