పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్.. ప్రభాస్‌తో యువ దర్శకుడి ప్లాన్ మామూలుగా లేదు
రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇప్పుడు దేశంలోనే టాప్ పాన్ ఇండియా స్టార్. బహుబలితోనే నేషనల్ వైడ్ గా క్రేజ్ అందుకున్న ప్రభాస్ స్టామినాకు బాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది. ఇక రాబోయే సినిమాలు అంతకు మించి అనేలా ఉన్నాయి. మొత్తానికి అనుకున్నట్లుగానే ప్రభాస్ సినిమా హాలీవుడ్ లో కూడా రిలీజ్ కాబోతోంది. యువ దర్శకుడు చాలా పవర్ఫుల్ గా రెడీ అవుతున్నట్లు సమాచారం.
అమీరా దస్తర్ లేటేస్ట్ ఫోటో గ్యాలరీ... మరింత బ్యూటీ డోస్‌తో

లక్షల నుంచి 100కోట్ల వరకు
టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ ప్రయాణం ఎన్నో అపజాయలని దాటుకుంటూ ఇంతవరకు వచ్చింది. లక్షల్లో రెమ్యునరేషన్ అందుకున్న హీరో ఇప్పుడు 100కోట్ల వరకు వచ్చాడు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ప్రభాస్ ఎప్పుడు మారలేదు. అందుకే అతని స్థాయి పాన్ ఇండియా వరకు వెళ్లింది అంటారు. డార్లింగ్ ప్రస్తుతం చాలా పవర్ఫుల్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.
అంటీల కనిపించిన జాన్వీ కపూర్.. బొద్దుగా ముద్దుగుమ్మలా

అసలైన పాన్ ఇండియా స్టార్
ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా చేయాలని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు దర్శకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ ఇప్పటివరకు నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు. నార్త్ లో సాహో కూడా మంచి వసూళ్లను అందుకుంది. ఇక చైనాలో బాహుబలి కూడా సందడి చేసింది.

అదే నిజమయ్యేలా ఉంది
అయితే త్వరలో ప్రభాస్ హాలివుడ్ లో కూడా సినిమా చేయవచ్చని అప్పట్లో టాక్ అయితే బాగానే వచ్చింది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం అదే నిజమయ్యేలా ఉంది. ప్రభాస్ పేరు హాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా నిలవనుందట. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ సినిమాను ఇంగ్లీష్ లో కూడా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మొన్నటి వరకు కేవలం పాన్ ఇండియా రేంజ్ లనే రిలీజ్ చేయాలని అనుకున్న నాగ్ అశ్విన్ ఇప్పుడు ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ప్రీ ప్రొడక్షన్ ప్రయాణంలో..
సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే ఎక్కువ సమయం తీసుకుంటున్న నాగ్ అశ్విన్ జూన్ లేదా జులైలో షూటింగ్ పనులను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ప్రీ ప్రొడక్షన్ ప్రయాణంలో సినిమా కంటెంట్ తప్పకుండా వరల్డ్ వైడ్ గా క్లిక్కయ్యేలా ఉందని ఇంటర్నేషనల్ వైడ్ గా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. మరి సినిమా ఆ స్థాయిలో హిట్టవుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











