»   » జనం జోక్స్, కామెంట్స్, నాగ్ కు మండి..చైతూ,సమంతలను కూర్చో బెట్టి క్లాస్

జనం జోక్స్, కామెంట్స్, నాగ్ కు మండి..చైతూ,సమంతలను కూర్చో బెట్టి క్లాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వచ్చే సంవత్సరం మేలో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం, జీవీకే మనుమరాలు శ్రియా భూపాల్‌తో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరిళ్లలోనూ పెళ్లి పనులను ప్రారంభించేశారు కూడా. ఈ వివాహం తర్వాతే నాగచైతన్య, సమంతల వివాహం ఉంటుంది.

అయితే.. అన్న పెళ్లి కన్నా తమ్ముడు అఖిల్ పెళ్లి చేసుకోవటం ఏమిటని అందరూ కామెడీ చేస్తున్నారట. ముఖ్యంగా ఈ విషయమై సోషల్ మీడియాలో రకరకాల జోకులు పేలుతున్నాయి. అలాగే ... చైతూ, సమంతల పెళ్లి ,అలా చేస్తేనే చైతూతో పాటు కుటుంబం మొత్తానికి మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారట. ఈ విషయాలన్నీ నాగార్జున చెవిన పడ్డాయిట.

రోజు రోజుకీ తమ కుమారుల పెళ్లి విషయం కామెడీగా సోషల్ మీడియాలో కథనాలు గా వస్తూండటం గమనించిన నాగార్జన...దీనికో సొల్యూషన్ వెతకాలని ఫిక్స్ అయ్యారట. ఈ విషయమై నాగచైతన్య, సమంతలను కూర్చో బెట్టి విషయం వివరించి, ఒప్పించాడట. అఖిల్ కన్నా ముందే వివాహం చేసుకుంటే గౌరవంగా ఉంటుందని అన్నారట. ఎవరికోసమో తమ కమిట్ మెంట్స్ ఎలా ప్రక్కన పెడతారమని వాళ్లు వాదించినా ...నాగ్ ఒప్పుకోలేదని, తనకూ ఇబ్బందిగానే ఉందని, ఈ టాపిక్ బయిట మాట్లాడాలంటే, పెద్ద కుమారుడు పెళ్లి కాకుండా చిన్న కొడుకు వివాహం గురించి అందరినీ ఇన్వైట్ చేయటం ఎంబ్రాసింగ్ గా ఉందని, చెప్పి ఒప్పించారని అంటున్నారు.

Nag is said to have left irked and decided to lock the wedding date of Chay and Samantha.

దాంతో జనవరి 29న సమంత, చైతుల ఎంగేజ్‌మెంట్ జరిగిపోతుందని, ఆ తర్వాత మే కన్నా ముందే వారు పెళ్లి చేసుకుంటారన్న వార్త హల్ చల్ చేస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెలలో మంచి ముహూర్తాల కోసం అక్కినేని ఫ్యామిలీ చూస్తోందని అనుకుంటున్నారు.

మరో ప్రక్క రెండు సార్లు సమంతను చైతన్య పెళ్లి చేసుకుంటాడన్న వార్త కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తొలుత క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం చర్చిలో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత హిందూ సాంప్రదాయ పద్ధతిలో చేసుకుంటాడని చర్చించుకుంటున్నారు. ఈ వార్తల్లో ఏది నిజమో, ఏది కాదో మాత్రం అక్కినేని ఫ్యామిలీనే క్లారిటీ ఇవ్వాలి.

English summary
Naga Chaitanya and Samantha will get married sometime during March or April before Akhil gets hitched.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu