దూరంగా పొండి అంటూ...నాగార్జున చిటపటలు
సెలబ్రిటీల కుటుంబాల్లో వివాహ వేడుకైనా, విషాద వేడుకైనా, ఏవేడుకైనా ఈ మధ్య మీడియా తెగ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. మీడియా ఇలా పోటీ పడటానికి వివిధ చానల్స్ మధ్య పెరిగి పోతున్న పోటీ తత్వమే అని కొత్తగా చెప్పక్కర్లేదు. వీరి పోటీ తత్వం ఒక్కోసారి సదరు సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.
తాజా విషయానికొస్తే... .అన్నపూర్ణమ్మ మరణంతో అక్కినేని కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ వైపు కుటుంబీకులంతా విషాదంలో మునిగి ఉంటే మీడియా హడావుడి కూడా మొదలైంది. అసలు మీడియాకు చాలా దూరంగా ఉండే నాగార్జునకు వారి తీరు నచ్చ లేదని, తన మనుషుల ద్వారా మీడియా వారిని ఆదేశించాడని, వచ్చి పోయే వారిని ఇబ్బంది పెట్టకుండా తమ ఇంటికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.
నాగార్జున ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం కూడా ఉంది. అన్నపూర్ణమ్మ అంతిమ యాత్రలో అక్కినేని నాగేశ్వరరావు కనిపించక పోవడంపై కారణం ఏమిటి? అంటూ ఊహాగానాలు ప్రసారం కావడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











