చైనీస్ బిజినెస్ లోకి నాగార్జున
నాగార్జున సినిమా నటుడుగా ఎంత పాపులరో అంతకుమించి వ్యాపారవేత్తగానూ అంత పేరు ఉంది. ఆయన తాజాగా జూబ్లిహిల్స్ లో ఎన్-ఆసియన్ పేరుతో ఓ రెస్టారెంట్ తెరుస్తున్నాడు. వచ్చే నెలలో ఓపెన్ కాబోయే ఈ రెస్టారెంట్ చైనీస్ ఆర్ధరైజ్డ్ రెస్టారెంట్ అని తెలుస్తోంది. దీనిపై నాగార్జున ఐదు కోట్ల రూపాయలు వరకూ ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంటీరియర్ డిజైనర్స్ ని రప్పించి రెస్టారెంట్ లోపల డిజైన్ చేయిస్తున్నట్లు సమాచారం.
మరో ప్రక్క నాగార్జున షిర్డీ సాయి చిత్రం షూటింగ్ లో బిజిగా ఉంటున్నాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం భక్తి రస ప్రధానంగా రూపొందనుంది. దీనితో పాటు శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఢమురకం చిత్రంలోనూ ఆయన నటిస్తున్నాడు. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఓ సోషియో ఫాంటసీ. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











