twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రాజుగారి గది- 2' : నిర్మాత కు నాగ్ అలా షాక్ ఇచ్చాడా?

    నాగార్జున హీరోగా ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రాజు గారి గ‌ది 2..చిత్రానికి భారి మొత్తమే తీసుకుంటున్నారు.

    By Srikanya
    |

    హైదరాబాద్ : నాగార్జున హీరోగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం 'రాజుగారి గది- 2' ఆదివారం హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాగార్జన ఏంటి ...అలాంటి కథని కమిటవ్వటం ఏమిటి అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే పీవిపి బ్యానర్ కు నాగార్జున సినిమా చేస్తానని మాట ఇచ్చి ఉండటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అనుకున్నారు. అయితే రెమ్యునేషన్ విషయంలో నాగ్ షాక్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు.

    ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం... నాగార్జున ఎంట్రీతో 'రాజుగారి గది- 2' బడ్జెట్ రెండు రెట్లు అయ్యిుందిట. ఎందుకంటే నాగార్జున...నలబై రోజులు డేట్స్ ఇచ్చి, ఐదు కోట్లు తన రెమ్యునేషన్ గా వసూలు చేస్తున్నారట. మొదట నిర్మాతలు ఈ రెమ్యునేషన్ ఎమౌంట్ విని కంగారు పడ్డారట. ఎందుకంటే అసలు రాజుగారి గది 2 ని కేవలం నాలుగు కోట్లతో చేద్దామని ఫిక్స్ అయ్యారట. కానీ నాగార్జున సీన్ లోకి రాగానే మొత్తం మారిపోయింది.

    In Pics : Raju Gari Gadhi 2 Movie Launch

    నాగార్జునకే ఐదు కోట్లు ఇచ్చినప్పుడు ..సినిమాని కూడా భారీగా తీయాల్సిన పరిస్దితి. దాంతో మరో ఐదు కోట్లు మిగతా వాటిమీద పెడుతున్నారట. అయితే నాగార్జున లాంటి స్టార్ ఉన్నప్పుడు బిజినెస్ బాగుంటుంది. అలాగే శాటిలైట్ కూడా బాగానే లాగవచ్చు అని నిర్మాత ప్లాన్ చేసుకుని ఓకే అన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

    Nag's remuneration for Raju Gari Gadi2

    నాగార్జున మాట్లాడుతూ...ఓం నమో వెంకటేశాయ షూటింగ్ చివరి రోజు చాలా బాధపడ్డాను. ఓ మంచి సినిమా చిత్రీకరణ అప్పుడే పూర్తయిపోయిందా? అనిపించింది. ఈ సినిమా తర్వాత ఎలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఓంకార్ వద్ద మంచి కథ వుందని పీవీపీ, నిరంజన్ నాతో చెప్పారు.

    వయసైపోతుంది కాబట్టి భవిష్యత్తులో నేను లీడ్ క్యారెక్టర్స్ చేస్తానో లేదో తెలియదు. కథలో ఏదో స్పెషాలిటీ వుంటేనే నటిస్తాను అని వారితో అన్నాను. అనుకున్నట్లుగా ఈ సినిమాకు అద్భుతమైన కథ కుదిరింది అన్నారు నాగార్జున.

    అలాగే... కామెడీ మేళవించిన హారర్ థ్రిల్లర్ చిత్రమిది. ఇప్పటివరకు ఇలాంటి కథతో సినిమా చేయలేదు. కథ వినగానే ఎక్సైట్ అయ్యాను. నా పాత్ర చిత్రణ వైవిధ్యంగా వుంటుంది అన్నారు.

    ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని నాగార్జునను చూస్తారని దర్శకుడు ఓంకార్ పేర్కొన్నారు. నాగార్జునగారి సూచనలతో స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశామని, డిసెంబర్ మొదటివారంలో షూటింగ్‌ను ప్రారంభిస్తామని నిర్మాత పీవీపీ చెప్పారు.

    నాగార్జున‌, వెన్నెల కిషోర్, అశ్విన్ బాబు, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ - దివాక‌ర‌న్, మ్యూజిక్ - త‌మ‌న్, ఆర్ట్ - ఎ.ఎస్.ప్ర‌కాష్, డైలాగ్స్ - అబ్బూరి ర‌వి, నిర్మాత - పి.వి.పి, ద‌ర్శ‌క‌త్వం - ఓంకార్.

    English summary
    Nagarjuna quoted a whopping remuneration of Rs 5 crores for 40 days of shoot which left Raju Gari Gadhi 2 makers in surprise.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X