క్యాబ్, ఆటో డ్రైవర్లే నాగార్జున టార్గెట్

By Srikanya

నాగార్జున హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఆధ్యాత్మిక చిత్రం 'శిరిడిసాయి'. ఈ చిత్రం ఆడియో ఈ నెల 30న హైదరాబాద్‌లో విడుదల చేస్తారు. అయితే ఆడియో సిడిలు అవీ గతంలో లా ఎవరూ కొని వినటం లేదు. కేవలం క్యాబ్ డ్రైవర్స్ వంటి వారు మాత్రమే ఎక్కువ మొత్తంలో ఈ సీడిలను కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన వారు నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవటం వంటివి చేస్తున్నారు. అలాగే క్యాసెట్స్ ను ఆటో డ్రైవర్స్ మాత్రమే తీసుకుంటన్నారు. ఈ నేపధ్యంలో తన కొత్త చిత్రం ఆడియోను వారికి అందుబాటులో ఉండేలా తక్కువ రేటుకి అందచేయాలని నాగార్జున నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇక 'శిరిడిసాయి' చివరి రోజు షూటింగ్ ఈ నెల 26న షిరిడీలో జరుగుతుంది. ఇందుకోసం ఓ స్పెషల్ టైన్‌లో 25న నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, రాఘవేంద్రరావు, నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు యూనిట్ సభ్యులు కుటుంబసమేతంగా షిరిడీ వెళుతున్నారు. 26న 'శిరిడిసాయి' ఆడియో సి.డి.ని బాబా పాదాల దగ్గర ఉంచి పూజలు చేస్తారు. సెప్టెంబర్ 6న సినిమా విడుదలవుతుంది.

''వాసనలు వేరైనా, వర్ణాలు ఎన్నయినా పూలన్నీ ఒక్కటే. ప్రతి పువ్వు పూజించడానికి అర్హమైనదే అనేది సాయిబాబా ప్రబోధం. కులమతాలను త్యజిద్దాం, మనుషులంతా ఒక్కటే అనేది ఆ మాటల్లో అంతర్లీనంగా ఉన్న సత్యం. పరమాత్ముడు ఎక్కడో లేడు, పసిపాప మనసున్న ప్రతి వ్యక్తిలోనూ దేవుడున్నాడని బోధించారాయన. సాయి జీవనశైలి, ఆయన ఆధ్యాత్మిక చింతన యువతకు తెలియాల్సిన అవసరం ఉంది. సాయి పాత్రలో నాగార్జున చక్కగా ఒదిగిపోయారు. కీరవాణి సంగీతం మరింత బలం తీసుకొచ్చింది'' నాగార్జున అన్నారు

శ్రీకాంత్, శరత్‌బాబు, సాయికుమార్, శ్రీహరి, షాయాజీ షిండే, బ్రహ్మానందం, ఆలీ, అనంత్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, కమలిని ముఖర్జీ, రోహిణి హట్టంగడి, వినయ్‌ప్రసాద్, మజుతా దేశ్‌ముఖ్, కౌశిక్, నాగేష్ భోస్లే, దేవేందర్ డాడ్కే, దినకర్ గవండే, దీపాలి డాడ్కే, భవాని, రవిభట్, విజయ తదితరులు నటించే ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, వేదవ్యాస్, మెడిచర్ల సత్యనారాయణమూర్తి, సంగీతం: కీరవాణి, ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి, ఎడిటింగ్: శర్వన్, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్, కథాసంకల్పం: భక్తసురేష్, కథాసహకారం: పొందూరి హనుమంతరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.విక్రమ్‌కుమార్, సమర్పణ: సులోచనారెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X