»   »  మరో మెగా ఫ్యామలీ స్టార్ ?

మరో మెగా ఫ్యామలీ స్టార్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nagababu
ప్రస్తుతం తెలుగు తెర వారసులకు వెలకమ్ చెప్పే పనిలో బిజీగా ఉంది. మొన్న నాగార్జున మేనల్లుడు సుశాంత్ కాళిదాసు గా కనపడితే...నాగ చైతన్య మరో క్రేజీ ప్రాజెక్టు తో ముందుకు రాబోతున్నాడు. అలాగే రామానాయుడు మనువడు రాణా కూడా త్వరలోనే హీరోగా తెరపై కవపడే అవకాశం ఉందని చెపుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరొక మనువడు హీరో అవ్వాలని ఆ ప్రయత్నాలలో ఉన్నాడుట. క్రితం సంవత్సరం చిరు తనయుడు రామ్ చరణ్ తేజ గ్రాండ్ గా చిరుతతో లాంచ్ అయ్యాడు. తాజాగా చిరంజీవి కుటుంబం నుండి మరో నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.చిరుత రూటులోనే అతని సోదరుడు (నాగబాబు కుమారుడు వరుణ్ బాబు) ప్రయాణం చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ హీరో కావటానికి గల ట్రైనింగ్ లన్నీ పూర్తిచేసి ఎప్పుడెప్పుడా తన తెరంగ్రేటం అని తండ్రి వైపు చూస్తున్నాడు. ఆయన పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు. అయినా ఖాళీ చేసుకుని ఓ యువ దర్శకుడు చెప్పిన యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీ (దాదాపు కొత్త హీరోల ఇంట్రడక్షన్ కథలన్నీ ఒకలాగే ఉంటాయి) విన్నాడట. నచ్చిందని చెప్పాడుట. ఇక చిరంజీవి కూడా ఆ కథ విని పచ్చ జెండా ఊపితే ప్రాజెక్టు స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X