‘రన్ రాజా రన్’దర్శకుడు నెక్ట్స్ హీరో ఖరారు
హైదరాబాద్ : 'రన్ రాజా రన్'చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకున్న దర్శకుడు సుజీత్. అతని చిత్రం మంచి కలెక్షన్స్ తో శర్వానంద్ కెరీర్ లో లేని విధంగా రికార్డులు క్రియేట్ చేస్తూండటంతో ఇండస్ట్రీ మొత్తం దృష్టి అతనిపై పడింది. అతను తదుపరి చిత్రం దాదాపు ఖరారైయినట్లే అని తెలుస్తోంది. నాగ చైతన్య హీరోగా సుజీత్ చిత్రం ఓకే అయినట్లు చెప్తున్నారు.
'రన్ రాజా రన్'విడుదల రోజే అతనికి శుభాకాంక్షలు తెలిపి, మీట్ అయి నాగ చైతన్య అతనితో చిత్రం చేయటానికి ఆసక్తి చూపించాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. దాంతో అతను చెప్పిన స్టోరీ లైన్ ఓకే చేసారని, త్వరలో పూర్తి స్క్రిప్టు వినిపించిన వెంటనే సుజీత్ తో చిత్రం స్వంత బ్యానర్ లో ప్రారంభమవుతుందని సమాచారం.

సుజీత్ విషయానికి వస్తే... దాదాపు 40దాకా షార్ట్ ఫిల్మ్ లు తీసి యు ట్యూబ్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా 'రన్ రాజా రన్'. క్రిందటి శుక్రవారం విడుదలైన ఈ చిత్రం యువతకు బాగానే నచ్చింది. ఎ సెంటర్లలలో ఈ చిత్రం దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది.
ప్రస్తుతం నాగచైతన్య...స్వామి రారా చిత్రంతో హిట్ కొట్టిన దర్శకుడు సుధీర్ వర్మతో సినిమా చేస్తున్నారు. అలాగే...గుండె జారి గల్లంతైంది చిత్రంతో విజయం సాధించిన కొండా విజయకుమార్ తో చేసిన ఒక లైలా కోసం చిత్రం రెడీగా ఉంది. అలా హిట్ కొట్టిన యువ దర్శకులకు వెంటనే ఆఫర్స్ ఇస్తూ నాగచైతన్య తనకు యూత్ లో క్రేజ్ ఉండేటట్లు చూసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











