ప్రముఖ రచయిత శ్రీశ్రీ గా నాగచైతన్య!
ప్రముఖ రచయిత శ్రీశ్రీ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు జాతికి శ్రీశ్రీ ఓ రోల్ మోడల్. శ్రీరంగ శ్రీనివాసరావు అసలు పేరయినా శ్రీశ్రీ గానే తెలుగు భాషా ప్రియుల్ని అలరించారయన. నేను సైతం.." అంటూ శ్రీశ్రీ సాహిత్యం సినీ గేయాలుగానూ తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరించింది. మైమరపించింది. ఇప్పటికీ మైమరపిస్తూనే వుంది. ప్రస్తుతం శ్రీశ్రీ శత దినోత్సవం జరుపుకుంటున్నాము.
ఇదిలా ఉంటే అక్కినేని నట వారసుడు యంగ్ సెన్షేన్ నాగచైతన్య తెలుగు రోల్ మోడల్ శ్రీశ్రీ పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. అందుకు గాను 'రైడ్" చిత్ర డైరెక్టర్ రమేష్ వర్మ స్ర్కిప్ట్ ను రెడి చేశారని వార్తలు వస్తున్నాయి. కథ కూడా నాగచైతన్యకు బాగా నచ్చిందని అందుకోసం రమేష్ వర్మ ప్రొడ్యూసర్ వేటలో పడ్డట్టూ సమాచారం. అక్కినేని నాగేశ్వరరావు 'కాళిదాసు", 'విప్రనారాయణ" తదితర సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదే కోవలో ఆయన వారసుడు నాగార్జున 'అన్నమయ్య", 'శ్రీ రామదాసు" తదితర చిత్రాల్లో నటించాడు. తాజాగా నాగచైతన్య ప్రముఖ కవి శ్రీశ్రీ గా నటించాలనే ఆలోచన రావడం విశేషం.


Click it and Unblock the Notifications











