Don't Miss!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Sports IPL 2024 సీజన్లో చెలరేగేది ఆ కుర్రాడే: సునీల్ గవాస్కర్
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
ఆ సినిమా కోసం పూర్తిగా లుక్ మార్చేస్తున్న చైతూ.. ఎక్కడా తగ్గట్లేదుగా!
అక్కినేని హీరో నాగ చైతన్య ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకొని బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే ఒక సినిమా పూర్తి చేశారు. సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, రిలీజ్ కూడా ఎప్పుడో కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా వాయిదా పడిన తర్వాత ఇటలీ వెళ్ళిన నాగచైతన్య థాంక్యూ అనే సినిమా షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుని వచ్చారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా యొక్క చివరి షెడ్యూల్ హైదరాబాద్లో కూడా జరగాల్సి ఉంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడాని కంటే ముందుగా ఆయన మరో సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగ చైతన్య ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి నటించాల్సిన పాత్ర ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో చైతన్యకు దక్కిందని ముందు నుంచే ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో చైతు మునుపెన్నడూ లేని విధంగా ఒక సరికొత్త రూపంలో కనిపించనున్నారు అని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఇక కండలు పెంచిన రూపంలో కనిపించాల్సి ఉండడంతో ఇప్పుడు ఆయన జిమ్లో తీవ్రంగా కృషి చేస్తున్నాడు. చైతూ తన తాజా ఇన్స్టాగ్రామ్ వీడియోలో, భారీ బరువులు ఎత్తడంతో మరో పక్కన ఆయన ట్రైనర్ అభినందిస్తున్నాడు. ఇక చైతూ లాల్ సింగ్ చద్దాలో ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడట. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టుతో చైతన్య బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు.