Samantha Naga Chaitanya: మళ్లీ ఒకే గూటికి చైతూ - సమంత.. ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉందిగా!!
'అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య - టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ఒకే గూటికి చేరారా', 'ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి ఒకలానే ఉందా?', 'ఈ ఇద్దరికి టైమ్ అస్సలు బాలేదా?', 'అసలేమై ఉంటుంది ఈ జంటకి' అని చాలా మంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అదేంటి అసలు ఏం చెప్పబోతున్నానా అని కన్ఫ్యూజన్ గా ఉందా? వచ్చేస్తున్న మ్యాటర్ లోకి. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే...?
హీరో నాగచైతన్య సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామ్.. 'ఏం మాయ చేసిందో' తెలీదు కానీ అప్పట్లో నాగ చైతన్య.. ఆమె అంటే తెగ ఇష్టపడిపోయేవారు. పెళ్లంటే ఆమెనె చేసుకోవాలి అనేంత ప్రేమించి వివాహమాడారు. సామ్ కూడా చైతూను గాఢంగా ప్రేమించినట్లు పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చింది. వీళ్ళ పెళ్లి సమయంలో ఎంత హంగామా సాగిందో అభిమానులకు కూడా తెలిసిన విషయమే.

పదేళ్లు కూడా లేరు: సీన్ కట్ చేస్తే పట్టుమంటూ పదేళ్లు కూడా కాపురం చేసుకోకుండానే డివొర్స్ అంటూ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే విడిపోతున్నందుకు ఈ జంట ఎంత బాధపడిందో తెలీదు కానీ అభిమానులు కంట తడి పెట్టేసుకున్నారు. మళ్లీ ఈ ఇద్దురు కలవాలని ప్రార్థనలు కూడా చేశారు. కానీ దేవుడు ఆ ప్రార్థనలు వినలేదనుకుంటా! విడాకులు తీసుకుని ఎవరి దారి వారిది అన్నట్లుగా వెళ్లిపోయారు.

అంతగా ఏం కలిసిరాలేదు: అయితే ఇక్కడ విషయమేమింటే.. విడాకుల తర్వాత నాగచైతన్యకు అస్సలు కలిసి రాలేదని అంటున్నారు కొంతమంది అభిమానులు. 'బంగార్రాజు', 'లవ్ స్టోరీ' సినిమాలు తప్పితే.. ఇతర ఏ చిత్రాలు కూడా చైతూకు హిట్ కాలేదని అంటున్నారు.
'లాల్ సింగ్ చద్ధా', 'థ్యాంక్యూ', 'కస్టడీ' అన్నీ పోయాయి. ఇకపోతే అదే విడాకుల తర్వాత సమంతకి కలిసొచ్చినట్టే కనిపించింది. కానీ అది ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఒకటి రెండు సినిమాలు తప్ప ఈ అమ్మడుకు అంతగా పెద్ద హిట్ లు ఏమీ పడలేదు.

ఒకే గూటికి: ఊ అంటావా' సాంగ్ ఒక్కటే.. ఊహించని రేంజ్ లో భారీ హిట్ అయింది. ఆ క్రేజ్ తోనే కెరీర్ ను నెట్టుకొస్తుంది సమంత. ఆరోగ్యం కూడా అంతంమాత్రంగానే ఉంది. చికిత్స, విశ్రాంతి అంటూ ఉండాల్సి వస్తోంది. అప్పటికీ మనసులో బాధను దిగమింగుకుని షూటింగ్ లు చేస్తోంది. కానీ ఆ చిత్రాలు వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడేమో ఏకంగా ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటుందని తెలిసింది.
అంటే ఆమె పరిస్థితి కూడా బాలేదు. ఇటేమో చైతన్య కెరీర్ డౌన్ లో ఉంది. ఈ రకంగా చూస్తే ఇద్దరూ ప్రస్తుతం ఒకే పరిస్థితిలో ఉన్నారు. ఒకే గూటికి చేరారు. ఇదంతా నేను రాసిన మాటలు కాదండోయ్.. బయట జనాలు మాట్లాడుకుంటుంటే.. అవి కథనాలుగా వస్తుంటే వాటిని ఆధారంగా రాసింది. ఏదేమైనప్పటికీ ఇద్దరి కెరీర్ మంచిగా గాడిలో పడాలని వారి అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











