లగడపాటి శ్రీధర్ చిత్రంలో నాగచైతన్య...

By Srikanya

హైదరాబాద్: ఎవడిగోల వారిదే,స్టైల్, స్నేహగీతం వంటి చిత్రాల నిర్మాత లగడపాటి శ్రీధర్ తాజాగా ఓ చిత్రం నిర్మించటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా చేస్తున్నారు. ఆ సినిమానే 'చార్మినార్'రీమేక్ . ఈ కన్నడ చిత్రాన్ని ఆర్.చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాను సదరు దర్శకునితో కలిసి నాగచైతన్య, నిర్మాత లగడపాటి శ్రీధర్ ఇటీవల హైదరాబాద్‌లో చూసారు.

నాగచైతన్యకి 'చార్మినార్' విపరీతంగా నచ్చేయడంతో ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో నటించడానికి 'ఓకే' చెప్పేశారు. ''దర్శకుడు ఈ కథను నేరేట్ చేసిన తీరు బావుంది. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను'' అని అన్నారు. ఈ చిత్రం రీమేక్ హక్కులు లగడపాటి శ్రీధర్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి కన్నడ దర్శకుడు చంద్రుకే ఈ చిత్రాన్ని డెరైక్ట్ చేసే అవకాశం వస్తుందా? లేక ఇంకెవరైనా ఈ ఛాన్స్ దక్కించుకుంటారా? అనేదే ఇప్పుడు వారి ముందు ఉన్న ప్రశ్న.

నాగచైతన్య రీమేక్ చిత్రాల్లో నటించడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మరో రీమేక్‌లో కూడా నటించడానికి చైతూ సన్నద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే ఆయన తమిళ హిట్ 'వేట్టై' రీమేక్‌లో నటిస్తున్నారు. కిషోర్‌కుమార్ (డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్ మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే... తన తండ్రి అక్కినేని నాగార్జున కెరీర్‌లో మరిచిపోలేని హిట్‌గా నిలిచిన 'హలోబ్రదర్' రీమేక్‌లో కూడా నటించడానికి పచ్చజెండా ఊపేశారు నాగైచె తన్య. ఆ సినిమాకు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X