ఏమీ లేకుండా నాగ చైతన్య, సాయి పల్లవి: తెలుగు సినిమాల్లో ఎవరూ చేయని విధంగా!

తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఎంతో మంది స్టార్ కిడ్‌లు హీరోలుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్పెషల్‌గా నిలుస్తూ స్టార్‌డమ్‌తో హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున కొడుకు, యువ సామ్రాట్ నాగ చైతన్య ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేస్తోన్న అతడు.. మంచి ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు.

ఈ మధ్య కాలంలో నాగ చైతన్యకు హిట్లు పెద్దగా రాలేదు. అలాంటిది గత ఏడాది అతడు 'ధూత' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సత్తా చాటాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో 'తండేల్' అనే మూవీ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వహిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడగా.. అందుకు తగ్గట్లుగానే దీన్ని రూపొందిస్తున్నారు.

Naga Chaitanya and Sai Pallavi Without Makeup Looks In Thandel Movie

అక్కినేని నాగ చైతన్య - చందూ మొండేటి కాంబినేషన్‌లో రాబోతున్న 'తండేల్' మూవీ సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి నిజమైన కథ ఆధారంగా తెరకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ షూట్ మొదలు పెట్టేశారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను జరుపుతూ చాలా వరకూ టాకీ పార్టును కంప్లీట్ చేశారు.

గ్లింప్స్ విడుదలైన 'తండేల్' సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దీంతో ఈ చిత్రం గురించి ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించి తరచూ ఏదో ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి తెలుగులో ఎవరూ చేయని పాత్రల్లో కనిపించబోతున్నారని తెలిసింది.

Naga Chaitanya and Sai Pallavi Without Makeup Looks In Thandel Movie

మత్స్యకారుడి కథతో వస్తున్న 'తండేల్' మూవీలో రియాలిటీ కోసం నాగ చైతన్య, సాయి పల్లవి మేకప్ లేకుండానే కనిపించబోతున్నారట. కొన్ని సీన్స్‌లో అయితే వీళ్లిద్దరూ జీవించేసి మరీ నటించినట్లు తెలిసింది. గతంలో తెలుగు సినిమాల్లో కనిపించనంత రియాలిటీ ఇందులో ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి మరింతగా పెరిగిపోతుందనే చెప్పుకోవాలి.

ఇదిలా ఉండగా.. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి తెరకెకకిస్తోన్న 'తండేల్' చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X