twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదే ఊపులో మరొకటి కొట్టేద్దాం... చై మూవీలో సమంతను ఒప్పించే పనిలో డైరెక్టర్?

    |

    నాగ చైతన్య, సమంత కలిసి నటించిన 'మజిలీ' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. రియల్ లైఫ్ భార్యా భర్తలైన వీరు... పెళ్లి తర్వాత స్క్రీన్ మీద మచింత ముచ్చటగా కనిపించారనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ హిట్ పెయిర్‌తో మరో సినిమా సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    ప్రస్తుతం చైతన్య తన మేనమామ వెంకటేష్‌తో కలిసి 'వెంకీమామ' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత 'ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతితో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల అజయ్ భూపతి చైతన్యకు కథ చెప్పడానికి వెళ్లిన సమయంలో సమంత కూడా అక్కడ ఉండటంతో ఇద్దరికీ కలిపి స్టోరీ చెప్పారట.

    సమంతకు కూడా కథ నచ్చేసింది

    సమంతకు కూడా కథ నచ్చేసింది

    అజయ్ భూపతి చెప్పిన కథ సమంతకు కూడా బాగా నచ్చేసింది. దీంతో హీరోయిన్‌గా సమంతనే పెడితే బావుంటుందని సజెస్ట్ చేశాడట అజయ్ భూపతి. అయితే ఈ విషయంలో చైతన్య, సమంత ఆలోచించుకుని నిర్ణయం చెబుతామని వెల్లడించినట్లు సమాచారం. అయితే వీరి కాంబినేషన్ మళ్లీ సెట్టవుతుందా? లేదా? అనే అంశంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    చై, సామ్ బిజీ బిజీ

    చై, సామ్ బిజీ బిజీ

    ‘మజిలీ' తర్వాత ఇటు చైతన్యతో పాటు అటు సమంత కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. చైతన్య ‘వెంకీ మామ' మూవీ చేస్తుండగా.... సమంత ‘96' రీమేక్‌ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత అజయ్ భూపతి ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ సమాచారం వెలువడనుంది.

    ఈ జంటపై ప్రేక్షకుల్లోనూ పాజిటివ్ వైబ్

    ఈ జంటపై ప్రేక్షకుల్లోనూ పాజిటివ్ వైబ్

    సమంత-చైతన్యను రియల్ లైఫ్‌లో మాత్రమే కాదు ఆన్ స్క్రీన్ మీద కూడా ప్రేమికులుగా, భార్య భర్తలుగా చూసేందుకు ప్రేక్షకులు సుముఖంగా ఉన్నారు. ‘మజిలీ' చిత్ర విజయం పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఆల్రెడీ ఒక హిట్ పడింది కాబట్టి రాబయే సినిమాపై భారీ అంచనాలు ఉండటం ఖాయం.

    ‘మజిలీ' బ్లాక్ బస్టర్ విజయం

    ‘మజిలీ' బ్లాక్ బస్టర్ విజయం

    శివ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ‘మజిలీ' చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ రైట్స్ రూ. 21.14 కోట్లకు అమ్మగా... 10 రోజల్లోనే దాదాపు రూ. 30 కోట్ల షేర్ వసూలు చేయడం ద్వారా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. పెళ్లి తర్వాత చై, సామ్‌‌కు ఒక మెమొరబుల్ హిట్‌గా నిలిచింది.

    English summary
    Film Nagar source said that, After 'Venky Mama' Naga Chaitanya next film with ‘Rx 100’ director Ajay Bhupathi. The director narrated his script recently. Samantha is said to be roped for playing the female lead in this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X