Samantha నాగచైతన్యను కలిపేందుకు డైరెక్టర్ రంగంలోకి.. ఆమె మాటకు తలవొగ్గి కమిట్‌మెంట్!
అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం చాలా రోజుల పాటు టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా నడిచింది. వీరిద్దరు విడిపోయి ఒకరికొకరు బాగానే ఉన్నారు కానీ వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అందరూ భావిస్తున్న తరుణంలో వీరిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరగడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

విడిపోతారనే ప్రచారంతో
అక్కినేని నాగచైతన్య, సమంత ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య లో కూడా కలిసి నటించడంతో వీరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఆ తర్వాత మనం అనే సినిమాలో కూడా కనిపించారు. తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి సాంప్రదాయబద్దంగా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. టాలీవుడ్ లో అత్యంత క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోతారు అంటూ 2021 వ సంవత్సరంలో పెద్దఎత్తున ప్రచారం మొదలైంది.

బిజీబిజీగా
ఎందుకు మొదలైందో ఎలా మొదలయిందో తెలియదు కానీ చివరికి ఆ ప్రచారమే నిజమైతే విడిపోతున్నాం అని ఇరువురూ ప్రకటించారు. అలా ప్రకటించిన తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. విడిపోయిన తర్వాత సమంత నటించిన ఒక్క సినిమా కూడా బయటకు రాలేదు కానీ నాగచైతన్య రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలు అందుకున్నాడు.

కలిసి నటించే అవకాశం
అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. దానికి కారణం కూడా సమంత స్నేహితురాలు అని అంటున్నారు. వీళ్ళిద్దరూ ఎందుకు కలుస్తున్నారు? అది ఏ సినిమా ? అనేది ఆసక్తికరమనే చెప్పాలి. కొన్ని రోజుల క్రితం ఓ బేబీ! దర్శకురాలు, సమంతకు అత్యంత సన్నిహితురాలైన నందిని రెడ్డి నాగ చైతన్యకు స్క్రిప్ట్‌ను వినిపించారు. చైతన్యకు స్క్రిప్ట్ నచ్చడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

చైతన్య కోసం సమంతను
అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే నందిని రెడ్డి ఇప్పుడు నాగ చైతన్య సరసన సమంతా రూత్ ప్రభుని హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య - సమంతల విడాకుల ఎపిసోడ్‌లను పరిశీలిస్తే ఇది చాలా ఆసక్తికరమైన నిర్ణయం అని చెప్పక తప్పదు కదా. ఇదే నిజమైతే, విడాకులు తీసుకున్న తర్వాత ప్రేక్షకులు ఈ ఇద్దరినీ జంటగా చూడటం ఇదే మొదటి సారి.
Recommended Video


కలిసి పని చేస్తారా?
ఒకవేళ నిజంగా వీరిద్దరి మధ్య ప్రాజెక్టు ఓకే అయితే కనుక ఇది వీరిద్దరికీ ఐదవ ప్రాజెక్టు అవ్వనుంది. నాగ చైతన్య - సమంత ముందుగా ఏ మాయ చేసావేలో కలిసి నటించారు, ఆ సినిమాతోనే వారి ప్రేమ ప్రయాణం ప్రారంభమైంది. తరువాత వారు ఆటో నగర్ సూర్యలో కూడా కలిసి నటించారు, ఆపై వారి ప్రేమ మొదలైంది. ఆ తర్వాత మనం సినిమాలో కలిసి నటించిన వీరు చివరిగా కనిపించింది మజిలీ సినిమాలోనే. వీరిద్దరు నటీనటులు తమ విభేదాలను పక్కన పెట్టి మళ్లీ కలిసి పనిచేస్తారా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











