అదిరిపోయే అప్‌డేట్.. అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ విషయంలో భర్తతో కలిసి సమంత ప్లాన్
టాలీవుడ్‌లో ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. హీరోలో నిర్మాతల అవతారమెత్తుతున్నారు. సొంత ప్రొడక్షన్ హౌస్‌లు పెట్టి చిత్రాలను నిర్మించేస్తున్నారు. ఒకప్పుడైతే హీరోలు నటనకు మాత్రమే పరిమితమయ్యేవారు. కానీ ఈ తరం మాత్రం ఓ వైపు నటిస్తూనే.. మరో వైపు నిర్మాణం వైపు కన్నేస్తున్నారు. ఈ వరుసలో స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు అందరూ చేరిపోతున్నారు.

పెరిగిన ప్రొడక్షన్ కంపెనీలు..
స్టార్ హీరోలైన మహేష్ బాబు జీఎంబీ అంటూ ప్రతీ సినిమాలో భాగస్వామిగా ఉంటున్నాడు. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ అంటూ చిరంజీవి సినిమాలను వరుసగా నిర్మిస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నాడు. నాని, విజయ్ దేవరకొండ, సుధీర్ బాబు వంటి వారు మీడియం రేంజ్ సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.

ఎవరికి వారే సొంతంగా..
టాలీవుడ్‌లో రాను రాను నిర్మాతలనే వారే ఉండరేమోనని అనిపిస్తోంది. మెగా ఫ్యామిలీకి ఇప్పటికే రెండు మూడు బ్యానర్స్ ఉన్నాయి. నందమూరి కుటుంబం నుంచి బాలకృష్, కళ్యాణ్ రామ్ సొంతంగా నిర్మిస్తూనే ఉన్నారు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు

సమంత, నాగ చైతన్య స్కెచ్
వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో సమంత ఇక హీరోయిన్ చేసేది మహా అంటే ఓ రెండు మూడేళ్లే. ఆపై తల్లిగా మారడమో, సినిమాలకు దూరంగా వెళ్లడమో ఏదోఒకటి జరిగే అవకాశం ఉంది. అయితే అప్పుడు అలా ఖాళీగా ఉండకూడదనే ఓ కొత్త స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.
Recommended Video


మరో నిర్మాణ సంస్థ..
అక్కినేని ఫ్యామిలీ ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోతో పాటు మరో రెండు మూడు నిర్మాణ సంస్థలను కలిగి ఉన్నాయి. తాజాగా చైతూ.. సామ్ లు మరో బ్యానర్ ను రిజిస్ట్రర్ చేయించినట్లుగా సమాచారం అందుతోంది. అక్కినేని నాగచైతన్య సమంత(ఏఎన్ఎస్) పిక్చర్స్ అనే బ్యానర్ ను రిజిస్ట్రర్ చేయించారట. ఇక దీనిపై త్వరలోనే ఓ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ రకంగా అక్కినేని అభిమానులకు, సామ్ ఫ్యాన్స్‌కు ఇది శుభవార్తే కదా. మొత్తానికి సామ్ ముందు చూపు అదిరిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











