సర్‌ప్రైజ్: ఆ హీరోయిన్‌తో నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్.. ఎక్కడ, ఎప్పుడు ఫిక్స్ చేశారంటే!

సినీ రంగంలో డేటింగ్‌లు అనేవి సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. అలా ఇప్పటికే ఎంతో మంది హీరో హీరోయిన్లు జంటలుగా మారి సందడి చేశారు. అందులో కొందరు విడిపోగా, మరికొందరు ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నారు. ఇక, కొన్నేళ్ల క్రితమే సమంత రూత్ ప్రభును అక్కినేని నాగ చైతన్య ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడిపోవడం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ అక్కినేని హీరో మరో హీరోయిన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చైతన్య ఆమెతో ఎంగేజ్‌మెంట్‌కు రెడీ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే...

సమంతతో విడిపోయాడు
అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు జంటగా మొదట 'ఏమాయ చేశావే' సినిమా చేశారు. ఇది చేస్తున్న సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లు.. 'ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో లవ్‌లో పడ్డారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ చాలా కాలం వైవాహిక బంధాన్ని సాగించారు. కానీ, ఎందుకనో కొన్నేళ్ల క్రితమే సమంత, నాగ చైతన్య అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement Date Fix

శోభితతో డేటింగ్ అంటూ

సమంత రూత్ ప్రభుతో విడిపోయిన కొద్ది రోజులకే అక్కినేని నాగ చైతన్య.. మన తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ మొదలు పెట్టినట్లు ప్రచారం మొదలైంది. దీనిపై ఇటు హీరో గానీ, అటు హీరోయిన్ గానీ ఎలాంటి విధంగా స్పందించలేదు. దీంతో వీళ్ల మధ్య బంధం నిజమే అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఫలితంగా చైతూ, శోభిత జోడీ హాట్ టాపిక్ అయిపోయింది.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement Date Fix

చాలా సార్లు ఫొటోలు లీక్
డేటింగ్ వార్తలు మొదలైన తర్వాత వాటికి బలాన్ని చేకూర్చేలా అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల చాలా సార్లు జంటగా కనిపించారు. ముఖ్యంగా విదేశాల్లో వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు లీక్ అవడం అప్పట్లో సంచలనం అయింది. ఆ తర్వాత కూడా వీళ్లిద్దరూ చాలాసార్లు కలుసుకున్నారు. ఆ ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో వీళ్ల డేటింగ్ నిజమే అని తేలిపోయింది.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement Date Fix

పెళ్లికి సిద్ధమైన లవ్ బర్డ్స్

సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత అక్కినేని నాగ చైతన్య ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరిగింది. ఈ మధ్య కాలంలో అయితే శోభితతోనే అతడు ఏడు అడుగులు నడుస్తాడని టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ నిజంగానే పెళ్లికి రెడీ అయ్యారట. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. త్వరలోనే శోభిత, చైతన్య వివాహం చేసుకోబోతున్నారట.

ఎంగేజ్‌మెంట్ పిక్స్ చేసి
చాలా ఏళ్లుగా ఒంటరిగా ఉంటోన్న నాగ చైతన్య.. శోభిత ధూళిపాళ్లతో నడుపుతున్న లవ్ స్టోరీ గురించి తన పేరెంట్స్‌కు చెప్పినట్లు తాజాగా ఒక సమాచారం వైరల్ అవుతోంది. అలాగే, ఆ హీరోయిన్ కూడా తన వాళ్లను ఒప్పించిందట. దీంతో వీళ్లిద్దరి పెళ్లికి రెండు ఫ్యామిలీలు ఒప్పుకున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు (గురువారం) వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరగనుందట.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement Date Fix

ఎక్కడ జరుగుతుందంటే

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్‌ ఈరోజు (ఆగస్టు 8) జరగబోతుంది. దీన్ని అక్కినేని వాళ్ల ఇంట్లోనే ప్లాన్ చేసినట్లు కూడా తెలిసింది. ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరగబోతుందని అంటున్నారు. దీనికి నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఫ్యామిలీలు మాత్రమే హాజరు అవబోతున్నాయని కూడా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X