Chaitu Shobitha: శోభితాతో కూడా చైతు సెపరేట్​.. ఆమె కూడా సమంతలా అలా చేసిందట!

టాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల తర్వాత హీరోయిన్ శోబితా ధూళిపాళ్ల, నాగచైతన్య.. డేటింగ్ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వీరి ప్రేమాయణం గురించి మరో విషయం బయటకు వచ్చింది.

చైతూ.. శోభితాను దూరం పెట్టాడు అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు. దానికి కారణం సమంతలానే శోభితా కూడా చేసిందట. అందుకే వీరు సపరేట్ అయ్యారు సోషల్ మీడియాలో అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

Naga Chaitanya and Samantha

సామ్ తో విడాకులు: సమంత రుత్ ప్రభు, నాగచైతన్య అక్కినేని వివాహం అక్టోబర్ 7వ తేదీ, 2017లో హిందూ, క్రిస్టియన్ మత సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబల మధ్య ఈ పెళ్లి జరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ బెస్ట్ కపూల్స్ లో ఒకరుగా నిలిచారు. కానీ ఏమైందో తెలియదు 2 అక్టోబర్ 2021న వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ న్యూస్ తో అభిమానులు అంతా ఆందోళన చెందారు.

Naga Chaitanya and Sobhita Dhulipala

శోభితా చైతూ ఫోటోస్ వైరల్: అయితే సమంతతో విడాకుల తర్వాత టాలీవుడ్ హీరోయిన్ శోభితా దూళిపాళ్ల.. నాగచైతన్యకు దగ్గరయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరు ఇరువురు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. దీనికి తగ్గట్లే వీళ్లు కూడా బయట కలిసి తిరిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక అక్కినేని కోడలు శోభితా దూళిపాళ్ల అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

Naga Chaitanya and Sobhita Dhulipala

నో రెస్పాండ్: ఇటీవల ఓ హోటల్ లో చైతూ అక్కడి వారితో మాట్లాడుతున్నట్లు ఉన్న ఫోటో వైరల్ కాగా.. అందులో వెనుక శోభితా ఉందని కామెంట్స్ వినిపించాయి. వీటిపై చైతూ కానీ, శోభితా కానీ డైరెక్ట్ గా స్పందించలేదు. అయితే ఇటీవల శోభితా దూళిపాళ్ల ది నైట్ మేనేజర్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. ఇక ఈ సిరీస్ లో ఈమె రెచ్చిపోయి లిప్ లాక్ సీన్స్ లో నటించింది. దీనితో ఫ్యాన్స్ ఈమెపై మండిపడుతున్నారు.

Naga Chaitanya and Sobhita Dhulipala

అసలు విషయం ఏమింటంటే: ఇలా లిప్ లాక్ సీన్స్ , బోల్డ్ సీన్లలో నటించడం వల్ల సమంతతో చైతూ విడిపోయాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు శోబితా కూడా ఇలాగే నటిస్తోంది. సమంతలాగే శోభితా కూడా అడల్ట్ సీన్స్ లో నటిస్తే.. చైతూ ఎలా యాక్సెప్ట్ చేస్తాడు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఈ అక్కినేని ఇంటికి కోడలు అయ్యే వాళ్లందరూ ఇలాంటి బోల్డ్ సిరీస్లను ఎందుకు చూస్ చేసుకుంటున్నారో..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇలా శోబితా కూడా చైతూ మనసు విరిచేసిందంటూ ఆవేదన చెందుతున్నారు.

Naga Chaitanya

హిట్ కోసం చైతూ వెయింటింగ్: ప్రస్తుతం చైతూ హిట్స్ లేక అల్లాడిపోతున్నాడు. ఆయన నటించిన కస్టడీ కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడు కార్తీకేయ 2 దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఓ డిఫరంట్ జోనర్లో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ సినిమాలో చైతూ ఫిషర్ మ్యాన్ గా కనిపించనున్నాడట. ఇక ఈ సినిమా అయినా చైతూకు సక్సెస్ ఇచ్చి ఫాంలోకి తీసుకువస్తోందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X