నూకయ్య దర్శకుడితో నాగచైతన్య?
ప్రస్తుతం ఆటో నగర్ సూర్య చిత్రంలో నటిస్తున్న హీరో నాగచైతన్య తాజాగా మరో చిత్రానికి సైన్ చేసినట్టు తెలుస్తోంది. మనోజ్ మంచు హీరోగా 'మిస్టర్ నూకయ్య' చిత్రాన్ని రూపొందించిన 'అని కన్నెగంటి' ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయనీ, త్వరలో షూటింగు మొదలవుతుందనీ అంటున్నారు. ఈమధ్య వరుసగా ఫ్లాప్స్ రావడంతో చైతూ తన కొత్త చిత్రాల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడు. నిర్మాత, దర్శకుడు విషయాల్లో సెలెక్టివ్ గా ఉంటున్నాడు.
కాగా..ఆటో నగర్ సూర్య చిత్రానికి దేవా కట్ట దర్వకత్వం వహిస్తున్నారు. ఆటోనగర్ అడ్డాగా మార్చుకొన్న సూర్య ఏం చేశాడు? అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. ఈ చిత్రంలో సాయికుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంత చేస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా. సంగీతం: అనూప్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్.
నాగచైతన్య, రాధా మోహన్ దర్శకత్వంలో రూపొందాల్సిన గౌవరం చిత్రం ఆగిపోయిందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడా ప్రాజెక్టుని యుటీవి వారు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











