twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్ని మర్చిపోయి మల్టీస్టారర్ కథపై ఫోకస్ పెట్టిన నాగచైతన్య.. సమంతకి బిగ్ హిట్ ఇచ్చిన హీరోతో స్పెషల్ మూవీ?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వైరల్ అవుతున్న సమంత నాగ చైతన్య విడాకులపై మొత్తానికి క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్స్ అఫీషియల్ గా సోషల్ మీడియాలో శనివారం ఒకే సమయానికి వారి వివరణ ఇచ్చేశారు. ఇక నాగార్జున కూడా కాస్త బాధతోనే చెప్పినప్పటికీ వారి వ్యక్తిగత నిర్ణయాలను గౌరవిస్తున్న ట్లు స్పందించారు. ఇక ఈ విషయంపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి ఇక నాగచైతన్య మాత్రం ఎప్పటిలానే తన సినిమా కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఒక మల్టీ స్టారర్ కథపై కూడా నాగచైతన్య చర్చలు జరుగుతున్నట్లు టాక్ అయితే వస్తుంది.

    వరుసగా బాక్సాఫీస్ హిట్స్

    వరుసగా బాక్సాఫీస్ హిట్స్

    అక్కినేని కుటుంబంలో ప్రస్తుతం వరుసగా విజయాలు అందుకున్న హీరోలలో నాగచైతన్య టాప్ లో ఉన్నాడు అని చెప్పవచ్చు. ఒక విధంగా నాగార్జున కంటే కూడా చైతన్య మెల్లగా తన మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉన్నాడు. గత కొంతకాలంగా నాగచైతన్య ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకుంటున్నాయి. ఇటీవల వచ్చిన లవ్ స్టోరీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది.

    లవ్ స్టోరీతో మరో హిట్

    లవ్ స్టోరీతో మరో హిట్

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య మొదటి సారి సాయి పల్లవితో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అయితే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఒక విధంగా కరోనా సెకండ్ వేవ్ అనంతరం అత్యధిక వసూళ్లు అందుకున్న ఇండియన్ సినిమాగా కూడా లవ్ స్టోరీ నాగచైతన్యకి మంచి గుర్తింపు లభించింది. వారం రోజుల తరువాత కూడా సినిమా కలెక్షన్స్ అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.

    రూమర్స్ అనుకున్నప్పటికి..

    రూమర్స్ అనుకున్నప్పటికి..

    ఒకవైపు లవ్ స్టొరీ సినిమా హడావిడిలో ఉన్నప్పటికీ కూడా నాగచైతన్య మరోవైపు తన వ్యక్తిగత విషయంలో కూడా ఒక నిర్ణయానికి రావడం విశేషం. సమంత తో విడాకులు తీసుకోబోతున్నట్లు శనివారం అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఈ విషయంపై అనేక రకాల కథనాలు వస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం ఎప్పటిలానే అవి రూమర్స్ అని అనుకున్నారు. ఒక విధంగా అక్కినేని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే మీడియాల పై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

    ఆ సినిమాతో బిజీగా

    ఆ సినిమాతో బిజీగా

    ఇక ఈ ఘటన సమయంలో తమకు ప్రైవసీ చాలా అవసరం అని నాగచైతన్య సమంత ఇద్దరూ కూడా అభిమానుల మద్దతు అలాగే మీడియా వైపు నుంచి సపోర్ట్ కూడా కావాలని కోరుకున్నారు. అయినప్పటికీ కూడా వీరిపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ విషయంపై పెద్దగా ఆలోచించ కూడదు అనే నాగచైతన్య తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా అవ్వాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య థాంక్యూ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

    మల్టీస్టారర్ సినిమాలో..

    మల్టీస్టారర్ సినిమాలో..

    థాంక్యూ సినిమా అనంతరం నాగచైతన్య ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించబోతున్నాడు. ఆ ప్రాజెక్టుకు కూడా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇటీవల మరో ప్రాజెక్ట్ పై నాగచైతన్య ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కొన్ని సినిమాలతో వరుస బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ఒక దర్శకుడు నాగ చైతన్య మల్టీస్టారర్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ దర్శకుడు ముందుగానే ఒక స్టార్ హీరో కూడా ఆ కథను వివరించినట్లు సమాచారం.

    Recommended Video

    Naga Chaitanya Samantha Divorce, ఆమెపై దుష్ప్రచారం వద్దు | #ChaySam || Filmibeat Telugu
    రామ్ చరణ్ తో చర్చలు..?

    రామ్ చరణ్ తో చర్చలు..?

    త్వరలోనే నాగ చైతన్య మరో మరో మల్టీస్టారర్ కథలో నటించబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు సమంత రంగస్థలం సినిమాలో నటించిన రామ్ చరణ్ తేజ్ అని సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది. రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే కాకుండా సమంత సినీ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు నాగచైతన్య రామ్ చరణ్ తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    Naga chaitanya another plans on new multi starrer project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X