అసెస్టెంట్ దర్శకుడుగా నాగ చైతన్య!?
నాగచైతన్య రెండవ చిత్రం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగచైతన్య అసెస్టెంట్ డైరక్టర్ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.ఇదొక రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది. ఇక మంజుల నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. నాగచైతన్య మొదటి సినిమా జోష్ పరాజయం పాలవటంతో ఈ చిత్రం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా సమంత అనే టీనేజ్ గర్ల్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. మొదటి షెడ్యూలు చెన్నై లో జరుపుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూలు నిమిత్తం అమెరికా వెళ్ళింది. గౌతమ్ మీనన్ గతంలో ఘర్షణ చిత్రాన్ని వెంకటేష్ తో చేసారు. ఆ సినిమా టెక్నికల్ గా పేరు తెచ్చుకున్నా వర్కవుట్ కాలేదు.
నాగ చైతన్య అసెస్టెంట్ డైరక్టర్ జోష్ దిల్ రాజు వాసు వర్మ గౌతమ్ మీనన్ మంజుల సమంతా nagachaitanya assistantdirector cinefield samantha gouthammenan gharshana venkatesh


Click it and Unblock the Notifications