తాతకే దగ్గు నేర్పుతున్న నాగచైతన్య...!?
అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన నాగచైతన్య 'జోష్" సినిమాతో 'జోష్"గా తన సినీ ప్రస్తానాన్ని ప్రారంభించినా, నాగచైతన్య మొదటి సినిమా అంత జోష్ గా ఆడలేకపోయినా, తర్వాత 'ఏ మాయ చేసావె" సమంతా సరసనా తన నటనతో అందరిని మాయ చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొన్నటికి మొన్న 100%లవ్ పేరుతో మిల్క్ బ్యూటీ తమన్నాక్రేజ్ తెచ్చుకొన్న నాగచైతన్య తాత అక్కినేని దగ్గర ఒక శపథం చేశాడట.
అక్కినేని నాగేశ్వరరావు నెక్ట్స్ బర్త్ డేకి టాలీవుడ్ లో మంచి మాస్ హీరో అనిపించుకుంటానని టాలీవుడ్ లో మగధీర కంటే పెద్ద హిట్ సినిమా చేస్తానని మాస్ లోనైనా, క్లాస్ లోనైనా నేనే నెం.1 అవుతానని ఛాలెంజ్ చేశాడట. అది విన్న నాగేశ్వర రావు గారు నెం వన్ స్థానం పొందటం అటుంచి మొదట కెరీర్ పై మొదట దృష్టి పెట్టు అన్నారంటూ నెం.1,నెం.2 స్థానాలు శాశ్వతం కాదు...సినిమాలు వరుసగా ఫెయిల్ అయితే అసలు స్థానం గురించే ఆలోచించరు. కాబట్టి నీవు స్థానం కోసం పడకుండా మంచి హీరో అని తెచ్చుకో అని చెప్పాడని సమాచారం.
ఇన్ని చెప్పినా తాత మాట వినకుండా నాగచైతన్య తెలుగులో నేనే నెం వన్ అవుతానని తాతకే దగ్గు నేర్పుతున్నాడట. అంత అనుభవం ఉన్న తాత నాగేశ్వరరావుకి దగ్గులు నేర్పటం అంటే ఇదేనేమో....


Click it and Unblock the Notifications











