అల్లు అర్జున్ మార్కెట్ ను కొల్లగొట్టాలని చూస్తున్న చైతన్య
హీరోగా ఎన్ని సినిమాలు చేసినా కానీ ఒక రేంజ్ ని దాటని అల్లు అర్జున్ తన మార్కెట్ పెంచుకోవడానికి మలయాళంలో కూడా తను నటించిన చిత్రాలు విడుదలయ్యేలా చూస్తున్నాడు. అతని దృష్టం బాగుండి అక్కడ బన్నీకి ఓ కోటిరూపాల మార్కెట్ ఏర్పడింది. అల్లు అర్జున్ సినిమా అంటే మలయాళం నుంచి కోటి వస్తుందనే గ్యారెంటీ దక్కింది. దాంతో ఇప్పుడు తనలా మిడిల్ రేంజ్ హీరోలు మరికొందరు ఆ మార్కెట ని కొల్టగొట్టాలని చూస్తున్నారు.
నాగార్జున తనయుడు చైతన్య నటించిన 100%లవ్ చిత్రాన్ని అక్కడ కూడా విడుదల చేస్తున్నారు. ఆర్య సినిమా దర్శకుడిగా సుకుమార్ కి ఉన్న పేరుని వాడుకుని చైతన్య అక్కడ కాలు పెడుతున్నాడు. 100% లవ్ కనుక క్లిక్ అయితే ఏమాయ చేసావె సినిమాని కూడా అక్కడ రిలీజ్ చేసి, ఆపై తన సినిమాలన్నీ మలయాళంలోకి అనువదించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి అల్లు అర్జున్ కి దక్కిన అదృష్టం అక్కడ చైతన్యకీ దక్కుతందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











