ఆ హిందీ రీమేక్ లో నాగచైతన్య ఖరారు?
నాగచైతన్య తాజాగా ఓ హిందీ రీమేక్ కి కమిటయ్యారని సమాచారం. ఒక ప్రముఖ తమిళ పత్రిక కథనం ప్రకారం తమిళ దర్శకుడు కన్నన్ రీసెంట్ గా నాగచైతన్యని కలిసారు. నాగచైతన్యతో హిందీలో సూపర్ హిట్టైన డిల్లీ బెల్లి రీమేక్ చేయటానికి ప్రపోజల్ పెట్టాడు. తమిళంలో ఈ పాత్రను జయం రవి చేత చేయిస్తున్నారు. తెలుగులో నాగచైతన్యను అడుగుతున్నారు. దీనికి నాగచైతన్య కూడా సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తను డేట్స్ ఎడ్జెస్ట్ చేయటంపై ఆయన ఆలోచనలో పడ్డారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య .. దేవకట్టా దర్సకత్వంలో ఆటో నగర్ సూర్య చిత్రం చేస్తున్నారు. అలాగే రాధామోహన్ దర్శకత్వంలో తమిళ,తెలుగు భాషల్లో గౌరవం అనే చిత్రం కమిటయ్యారు. వీటికి తోడు తాజాగా వీరభద్ర చౌదరి దర్సకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందే చిత్రంలోనూ చేయటానికి నాగచైతన్య ఓకే చేసారు.
నాగచైనత్య వరసగా తన యాక్షన్ సినిమాలు దడ, బెజవాడ డిజాస్టర్స్ కావటంతో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తనపై లవర్ బోయ్ ఇమేజ్ పడకుండా రకరకాల జనర్స్ చేసి ప్రూవ్ చేసుకుని మెల్లిగా యాక్షన్ జెనర్ లో సెటిల్ కావాలని భావిస్తున్నాడు. ఇక డిల్లీ భెల్లీ చిత్రం హిందీలో సూపర్ హిట్టైన న్యూ జనరేషన్ కామిడీ. కొద్దిగా అభ్యంతరమైన డైలాగులు,సీన్స్ తో కథనం నడుస్తుంది. అక్కడ అమీర్ ఖాన్ మేనల్లుడు నటించంటం,యూత్ కి బాగా నచ్చటం ఈ సినిమా విజయానికి కారణాలయ్యాయి.


Click it and Unblock the Notifications











