నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌కు దగ్గుబాటి ఫ్యామిలీ దూరం.. అక్కినేని ఫ్యామిలీతో ఆ విభేదాలే కారణమా?
యువ సామ్రాట్ నాగచైతన్యతో శోభితా ధూళిపాల నిశ్చితార్థం ఏ ముహుర్తాన జరిగిందో కానీ.. అనేక వివాదాలు, ఊహాగానాలకు తెరతీసింది. అయితే వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ వ్యవహారాన్ని అక్కినేని, దూళిపాల కుటుంబాలు హడావిడిగా, ప్రైవేట్ అఫైర్‌గా నిర్వహించారు. అయితే ఈ ప్రైవేట్ కార్యక్రమంలో నాగచైతన్యకు ఇష్టమైన దగ్గుబాటి కుటుంబం హాజరు కాలేదనే వార్త జాతీయ మీడియాలో కథనాలు వెలువుడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.
సమంత రుత్ ప్రభుతో విడాకుల తర్వాత బాలీవుడ్, టాలీవుడ్‌లో రాణిస్తున్న శోభితా ధూళిపాలతో నాగచైతన్య డేటింగ్ చేస్తూ వస్తున్నారు. 2012 నుంచి కొనసాగుతున్న ఈ అఫైర్ వారి లండన్ వెకేషన్ ద్వారా బయటపడింది. దాంతో వారిద్దరి డేటింగ్‌పై అనేక కథనాలు వచ్చాయి. చివరకు వారిద్దరి ఓ నిర్ణయానికి వచ్చి నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది.

అయితే తెలుగు సినిమా పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీకి అత్యంత ప్రతిష్ట కలిగిన కుటుంబం. దగ్గుబాటి లక్ష్మీ, నాగార్జున సంతానం నాగచైతన్య అనేది అందరికి తెలిసిందే. అయితే చైతూకు ఎప్పుడు మేనమామలు వెంకటేష్, సురేష్ అండగా ఉంటారు. అలాగే రానా దగ్గుబాటికి చైతూకి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. దగ్గుబాటి కుటుంబంలో చైతూ ఒక సభ్యుడిగా ఉంటారు.
అయితే చైతూ నిశ్చితార్థంలో దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు ఎవరూ రాలేదేని విషయాన్ని జాతీయ మీడియా రిపబ్లిక్ ప్రత్యేక కథనంలో వెల్లడించింది. అందుకు కారణాలను విశ్లేషిస్తూ.. శోభితతో నాగచైతన్య నిశ్చితార్థం ఆ కుటుంబానికి ఇష్టం లేదు. కాబట్టే ఆ కుటుంబం రాలేదని తన కథనంలో పేర్కొన్నది. అయితే ఇప్పటి వరకు దగ్గుబాటి కుటుంబం హాజరుకాలేదనే విషయాాన్ని ఎవరూ ఫట్టించుకోలేకపోయినప్పటికి.. తాజా కథనంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.
అయితే చైతూ ఎంగేజ్‌మెంట్‌కు మాత్రం తన తల్లి లక్ష్మీ, ఆమె భర్త శరత్ విజయరాఘవన్ మాత్రం హాజరయ్యారు. ఈ వేడుకలో వారు ప్రత్యేక ఆకర్షణగా మారారు అని తన కథనంలో పేర్కొన్నది. అయితే అక్కినేని ఫ్యామిలీతో తాజా విభేదాల కారణాల వల్లనే దగ్గుబాటి ఫ్యామిలీ ఈ వేడుకకు దూరంగా ఉందనే విషయాన్ని కథనంలో ప్రస్తావించింది.
అయితే ముందస్తు అపాయింట్‌మెంట్స్, ఈవెంట్స్ కారణంగా చైతూ నిశ్చితార్థం వేడుకకు దగ్గుబాటి ఫ్యామిలీ దూరంగా ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఏది ఏమైనా జాతీయ మీడియాలో వచ్చిన కథనం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దగ్గుబాటి ఫ్యామీలీ చైతూ ఎంగేజ్‌మెంట్‌కు రాకపోవడంపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











