Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగ చైతన్య కష్టాలకు వెంకటేషే కారణమా? వెంకీ మామ అప్డేట్
అక్కినేని నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్ రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్ళని అందరికీ తెలిసిందే. అయినా కూడా నాగ చైతన్య కష్టాలకు వెంకటేషే కారణం అని తెలుస్తోంది. కాకపోతే రియల్ లైఫ్2లో కాదులెండి.. రీల్ లైఫ్‌లో. నేటి హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయాలంటే బెటర్ ఆప్షన్ వెంకటేష్ అని ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు. మల్టీస్టారర్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో అదే బాటలో వెళ్తున్నారు దర్శకనిర్మాతలు.
ఈ నేపథ్యంలో మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా 'వెంకీ మామ'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుండగా, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ (కె ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అయితే తాజాగా వెంకీ మామ కథాంశానికి సంబందించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమాలో నాగ చైతన్య బాగా కష్టాలొస్తాయట. ఆ కష్టాలన్నీ తన మామ వెంకటేష్ వల్లనే ఉత్పన్నమవుతాయట. అయితే వాటి నుంచి బయటపడే క్రమంలో నాగ చైతన్య జ్యోతిష్యుల చుట్టూ తిరగాల్సి వస్తుందట. ఈ నేపథ్యంలో ఆసక్తికర సన్నివేశాలతో సినిమా సాగిపోతుందని అంటున్నారు. ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్టైన్ చేసే కామెడీ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. చిత్రంలో వెంకటేష్, నాగ చైతన్య మామ అల్లుళ్లుగానే నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కడుతున్న ఈ సినిమా అతిత్వరలో విడుదల కానుంది.