శేఖర్ కమ్ముల మ్యాజిక్.. నాగ చైతన్య లుక్ వైరల్
ఫిదా లాంటి సినిమాను తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఆపై చాలా గ్యాప్ తీసుకున్నాడు. హ్యాపీడేస్ చిత్రం తరువాత మళ్లీ అంతటి హిట్ సాధించింది ఫిదా. సాయి పల్లవి, వరుణ్ తేజ్ కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో సినిమా ఘన విజయాన్ని సాధించింది. అయితే ఆ సినిమా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. మరో సినిమాను ప్రేక్షకులకు అందించలేదు శేఖర్ కమ్ముల. అయితే మరోసారి అందర్నీ మెస్మరైజ్ చేసేందుకు ఈసారి నాగ చైతన్యను రంగంలోకి దించాడీ దర్శకుడు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి హీరో చైతు లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో సూపర్ కూల్ లుక్‌లో నాగ చైతన్య ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. చైతు పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 23న ఉదయం 10.30 నిమిషాలకు హీరో క్యారెక్టర్‌ని పరిచయం చేసే ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
సహజత్వం నింపుకొన్న ఉన్న పాత్రలతో అందమైన కథలను తెర మీద కు తెచ్చే శేఖర్ కమ్ముల ఈ ప్రేమ కథ ను మరింత హృద్యంగా మలుచుతున్నాడు. నాగ చైతన్య లుక్ విషయంలో మరింత కేర్ సుకుంటున్నారు డైరెక్టర్. తన ప్రపంచంలో కి ఆయన బర్త్ డే సందర్భంగా మనల్ని అహ్వానిస్తున్నాడు చైతు. అక్కినేని అభిమానులకు, సినిమా అభిమానులకు కొత్త ఎక్స్ పీరియన్స్ గా ఉండ బోతుంది ఆ వీడియో.

ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగచైతన్య సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











