twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్యకు ‘గౌరవం’ ఖరారు!

    By Bojja Kumar
    |

    అక్కినేని యువహీరో నాగచైతన్య తర్వాతి సినిమా టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. రాధామోహన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందబోతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'గౌరవం" అనే టైటిల్ ఖరారు చేసినట్లు సినీవర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. ఈ సినిమా గురించి వినిపిస్తున్న మరో గాసిప్ ఏమిటంటే ఇందులో నాగచైతన్యతో ఆయన తండ్రి నాగార్జున స్క్రీన్ పంచుకోనున్నారట.

    నాగచైతన్య పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా హీరోయిన్ ఎంపిక జరుగలేదు. 2012లో ఈ సినిమా సెట్స్ మీదనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన విషయాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

    ప్రస్తుతం నాగచైతన్య ఆటోనగర్ సూర్య చిత్రంలో షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రానికి దేవ కట్ట దర్శకత్వం వహిస్తున్నారు. మరో వైపు నాగచైతన్య హీరోగా వివేక్ దర్శకత్వంలో రాంగోపాల్ వర్మ రూపొందించిన బెజవాడ సినిమా విడుదలకు సిద్దం అయింది.

    English summary
    Young hero Naga Chaitanya has waved green to director Radha Mohan for a bilingual. The latest news is the film has been confirmed and titled as Gauravam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X