సమంతకి 200 కోట్లా? సోషల్ మీడియాలో వైరల్‌గా నాగ చైతన్య ఆఫర్
దేశంలోని దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లోనూ చాలా మంది స్టార్ కపుల్ ఉంటారని తెలిసిందే. అయితే కొందరు సీక్రెట్ రిలేషన్ లో ఉంటే.. మరికొందరు ఓపెన్ గానే తమ బంధాన్ని మైంటైన్ చేస్తూ పెళ్లి వరకు తీసుకెళతారు. ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి హాట్ టాపిక్‌గా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెనే కీర్తి సురేష్ కాగా.. ఈమె కూడా తన 15 ఏళ్ల రిలేషన్‌షిప్‌ని ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఇపుడు ఎట్టకేలకి పెళ్లి చేసుకుంది.
కాగా వీరి పెళ్ళికి ముందే ప్రముఖ హీరో అండ్ హీరోయిన్ అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్ళి జరిగిన సంగతి తెలిసిందే. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినీ ప్రముఖుల పెళ్లిళ్లతో సౌత్ ఇండస్ట్రీ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇంకోపక్క కొత్త జంటకి సమంత ఒక ఎమోషనల్ విషెస్ కూడా తెలపడం వైరల్ గా మారింది.

ఇలా ముగ్గురు స్టార్స్ కి సంబంధించిన ఈ డాట్స్ కలిసాయి. అయితే గతంలో సమంత - నాగ చైతన్యలు భార్యాభర్తలు అని అందరికీ తెలిసిందే. వీరు తెలుగు ఆడియెన్స్‌కి, మెయిన్ గా యువతకి ఫేవరేట్‌గా కూడా నిలిచారు. కానీ ఏమైందో తెలీదు ఇద్దరూ విడిపోతున్నట్టుగా అనౌన్స్ చేసి అందరికి షాకిచ్చారు. అయితే ఒకరంటే ఒకరు పడట్లేదేమో ఏమో కానీ.. సమంత నాగ చైతన్యని చాలా సార్లు టార్గెట్ చేసింది అంటూ విడాకుల తర్వాత పలు కామెంట్స్ వినిపించాయి.
మరి అదంతా గడిచిన మేటర్.. ఇపుడు ఓ షాకింగ్ రూమర్ అయితే సమంత విషయంలో సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సినీతారల్లో విడాకులు లాంటి వార్తలు వస్తే ఖచ్చితంగా భరణం అనేది కూడా చర్చనీయాంశమే. కొందరు అయితే భారీ మొత్తంలో భరణం తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ సమంత విషయంలో ఇదెప్పుడు వినిపించలేదు.

కానీ సామ్‌కి నాగ చైతన్య ఏకంగా రూ.200 కోట్ల భరణం ఆఫర్ చేసాడు అని ఓ పుకారు ఇపుడు షికారు చేస్తుంది. తమ విడాకుల అనంతరం భరణం కింద అక్కినేని కుటుంబం ఆమెకి రూ.200 కోట్లు భరణం కింద ఆఫర్ చేశారట. కానీ దానిని సమంత తీసుకోకుండా ససేమిరా తిరస్కరించిందట. నిజానికి ఓ స్టార్ జంట అందులోనూ.. భరణం లాంటివి తీస్కొని ఉంటే అప్పట్లోనే సమంతపై వార్తలు వచ్చేవి.
ఆమె తీసుకుంది అనో లేదా తీసుకోలేదనో. కానీ అవేవి వినపడలేదు కాబట్టి సామ్ అప్పట్లో భరణం తీసుకోలేదనే అనుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇపుడు తన విషయంలో లేట్‌గా ఈ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక సమంత రీసెంట్ వెబ్ సిరీస్ 'సిటాడెల్ హనీ బన్నీ' తో అలరించగా దీని తర్వాత మరిన్ని వెబ్ సిరీస్ సహా పలు సినిమాలు లైనులో ఉన్నాయట.


Click it and Unblock the Notifications











