For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విజయ్ దేవరకొండ చేయాల్సిన కథలో అక్కినేని హీరో.. లేడి డైరెక్టర్ తో న్యూ ప్రాజెక్ట్!

  |

  సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ లో ఉన్న దర్శకులు కథ చెప్పినప్పుడు కొంత మంది దానిని ఏకీభవించకపోవచ్చు. అయితే వారు చెప్పిన కథను చేయడానికి ఎవరో ఒకరు సిద్ధంగా ఉంటారు. దర్శకుల నమ్మకంగా ఉంటే ఎలాంటి కథలు చేయడానికైనా సరే ఓ వర్గం హీరోలు చాలా ధైర్యంగా ముందడుగు వేస్తారు. అలాంటి అతికొద్దిమంది హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. ఆయనకు కథ కంటెంట్ నచ్చితే చాలు ఎలాంటి దర్శకులతో అయినా సినిమా చేసేందుకు ముందుకు వెళ్తారు. కాస్త సందేహం ఉన్నా నిర్మాతలతో కూడా మాట్లాడుతారు. దర్శకుడికి వీలైనంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలని తనదైన శైలిలో సలహాలు కూడా ఇస్తాడు.

  విజయ్ తో వర్క్ చేయాలని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు దర్శకులు కోరుకుంటారు. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పూరి జగన్నాథ్ ఈ సినిమాని చాలా డిఫరెంట్ గా తెరకెక్కిస్తున్నట్లు విజయ్ దేవరకొండ చూస్తుంటేనే అర్థం అవుతోంది. అయితే విజయ్ దేవరకొండ చేయాల్సిన ఒక సినిమాలో ఇటీవల మరొక హీరో సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది.

  Naga chaitanya green signal to Vijay devarakonda rejected story

  విజయ్ మహానటి సినిమాలో సమంతకు జోడిగా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో అతనితో సినిమా చేయడానికి వైజయంతి మూవీస్ ఒక డీల్ సెట్ చేసుకుంది. టాలెంటెడ్ లేడి డైరెక్టర్ నందినీరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించాలని ఆ బడా బ్యానర్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. నాగ్ అశ్విన్ కూడా ఆ కథను చాలా బాగా లైక్ చేసినట్లు సమాచారం. అతనే విజయ్ తో మాట్లాడి సినిమా చేయించాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా విజయ్ కు మరొక కమిట్మెంట్స్ ఉండడంతో నందినిరెడ్డి సినిమాను చేయలేకపోయాడు. లైన్ లోకి పూరి జగన్నాథ్ సినిమా రావడంతో కొంత కాలం వరకు చిన్న సినిమాలు చేయకూడదని కూడా విజయ్ డిసైడ్ అయ్యాడు.

  ఆ విధంగా నందినిరెడ్డి విజయ్ దేవరకొండతో చేయాల్సిన కథ అక్కినేని హీరో నాగచైతన్యతో చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య ఆ కథను వినగానే ఏమాత్రం సందేహం లేకుండా ఒప్పుకున్నాడట. ప్రస్తుతం ఈ హీరో థాంక్యూ సినిమాతో పాటు తన తండ్రి బంగార్రాజు సినిమాల్లో కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే బంగార్రాజు సినిమా ఫినిష్ అవ్వడానికి నెల రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదు. ఇక మరోవైపు నందినీరెడ్డి సంతోష్ శోభన్ తో ఒక సినిమా చేస్తోంది. వీరి ప్రస్తుత కమిట్మెంట్స్ ప్రాజెక్టులు అయిపోతే వెంటనే కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టాలని చూస్తున్నారు. మరి నాగ చైతన్య ఆ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  English summary
  Naga chaitanya green signal to Vijay devarakonda rejected story,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X