'శివ' రీమేక్ హీరో?
రామ్ గోపావ్ వర్మ డైరక్షన్ లో వచ్చిన శివ చిత్రాన్ని రీమేక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సాహసం చేస్తున్నది మరెవరో కాదు నాగార్జునే అని తెలుస్తోంది. శివ చిత్రంలో విలన్ గా చేసిన జె.డి చక్రవర్తి దర్శకత్వంలో దీనని తెరకెక్కించాలని డిస్కషన్స్ జరుగుతున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ సారి హీరోగా నాగార్జున తనయుడు నాగ చైతన్య నటించే అవకాశం ఉంది. ఈ ప్రపోజల్ చైతన్యదే అని తన తండ్రి కెరీర్ ని మలుపు తిప్పిన ఆ చిత్రాన్ని చాలా సార్లు చూసిన అతను రీమేక్ చేస్తే బాగుంటుందని తన తండ్రి వద్ద ప్రపొజల్ పెట్టాడని వినికిడి.దానికి తన తాత రామానాయుడు సైతం ఓటేసాడని అంటున్నారు.
ఇక ప్రస్తుతం జె.డి. చక్రవర్తి నాగచైతన్య నటిస్తోన్న 'జోష్'లో విలన్ గా చేస్తున్నారు. అలాగే "జోష్" చిత్రంలో నటి రాధ పెద్ద కుమార్తె కార్తీక హీరోయిన్‌గా నటిస్తోంది. వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. అయితే శివ ఇప్పటి కాలమాన పరిస్ధితులు తగ్గట్లు కొన్ని మార్పులు చేయాలని నాగార్జున సూచించారని తెలుస్తోంది. జె.డి పూర్తి స్క్రిప్టు రెడీ చేసే పనిలో పడిపోయారు. ప్రస్తుతం జె.డి మరో హీరో సాయికుమార్ కుమారుడు హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రం డైరక్ట్ చేసే పనిలో ఉన్నారు. కిక్ నిర్మించి హిట్ కొట్టిన ఆర్.ఆర్.క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











