నాగ చైతన్య ఇంకోటి కమిటయ్యాడు

By Srikanya

హైదరాబాద్ : నాగ చైతన్య రీసెంట్ గా రన్ రాజా రన్ దర్శకుడుతో చిత్రం కమిటైన సంగతి తెలిసిందే. అలాగే సుధీర్ వర్మతో నూ చేస్తున్నారు. తాజాగా మరో చిత్రంకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పరుశరామ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం కి స్టోరీ లైన్ విన్న వెంటనే నాగ చైతన్య ఓకే చేసినట్లు తెలుస్తోంది. మొదట ఈ స్టోరీ లైన్ ని రామ్ కోసం తర్వాత రానా తో అనుకున్నారు. కానీ ఏదీ మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు నాగచైతన్య తో ఈ ప్రాజెక్టు ముందుకువెళ్లనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి చుట్టాలబ్బాయి అనే టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది.

నాగచైతన్య తాజా చిత్రం విషయానికి వస్తే..

నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించారు. నాగార్జున నిర్మాత. పూజాహెగ్డే హీరోయిన్. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు. సినిమా ప్రచారం చిత్రం ఇటీవల విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.

Naga Chaitanya in the direction of Parasuram

దర్శకుడు మాట్లాడుతూ ''రొమాంటిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కాలేజీ చదువు పూర్తి చేసి కన్‌ఫ్యూజన్‌లో ఉండే కార్త్తీక్‌ పాత్రలో నాగచైతన్య కనిపిస్తాడు. స్వేచ్ఛను ప్రేమించే కార్తీక్‌ ఓ సందర్భంలో నందనను కలుస్తాడు. ఆమెని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతన్ని ఇష్టపడదు. అయినా అనుకోని పరిస్థితుల్లో కార్తీక్‌ను పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ కార్తీక్‌ ఆమె ప్రేమను గెలుచుకున్నాడా.. లేదా? అనేది ఆసక్తికరం. వైవిధ్యమైన ఇతివృత్తంతో సాగే సినిమా ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. చైతూ, పూజా తమ పాత్రలకు న్యాయం చేశారు. సెప్టెంబర్‌ 5న సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు.

అలీ, సాయాజీ షిండే, రోహిణి, సుమన్‌, సుధ, చలపతిరావు, ఎం.ఎస్‌.నారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్‌, శుభలేఖ సుధాకర్‌, భరత్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రఽధారులు. ఈ సినిమాకు కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్‌కుమార్‌ కొండా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X