టాలెంట్ తో మన్మథున్నిపడగొట్టిన ఫార్ములాతో ఇప్పడు నాగ చైతన్య
'మాస్" సినిమాతో డైరెక్టర్ గా మారిన లారెన్స్ తర్వాత నాగార్జునతో 'డాన్" చిత్రానికి వర్క్ చేశాడు. నాగార్జున నమ్మకాన్ని గెలుచుకున్న లారెన్స్ త్వరలో ఆయన తనయుడు నాగచైతన్యతో ఒక చిత్రం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న నాగచైతన్య ఇందులో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఏ మాయ చేసావె", సుకుమార్ సినిమాల్లో క్లాస్ గా కనిపించిన చైతన్య వీటి తర్వాత చేస్తున్న అజయ్ భుయాన్ చిత్రంలో మాస్ రోలో చేస్తున్నాడు. దాని తర్వాత వచ్చే లారెన్స్ సినిమా కూడా మాస్ ని టార్గెట్ చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అంటే రెండు క్లాస్, రెండు మాస్ అంటూ చైతన్య తన ఇమేజ్ ని ఫర్ ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. ఏదో ఒక ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా నాగార్జున రూట్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. కాగా లారెన్స్ నాగచైతన్య చిత్రాన్ని కామాక్షి మూవీస్ బ్యానర్ లో డి శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తారు. నాగార్జున నమ్మకాన్ని చూరగొని అతడిని పుల్లుగా పడగొట్టిన లారెన్స్ ఇప్పుడు నాగ్ తో పాటు చైతన్యని కూడా తన హీరోల లిస్ట్ లో వేసుకున్నాడు. ఒక్కసారి నాగార్జున అంటూ ఇంప్రెస్ అయిపోతే ఇక ఎప్పటికీ అతనితో ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలు చేసుకోవడానికి అవకాశం దక్కించుకున్నట్టే.


Click it and Unblock the Notifications











