నాగచైతన్య, కాజల్ కాంబినేషన్ చిత్రం టైటిల్ ఏమిటంటే...
నాగచైతన్య, అజయ్ భుయాన్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి డ్రీమ్ లవర్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం నాగార్జున కెరీర్ కి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే మరో కీలకపాత్ర అయిన నాగచైతన్య అన్నయ్య పాత్రను ఒకరికి ఒకరు ఫేమ్ శ్రీరామ్ చేస్తున్నారు. కథ ప్రకారం ఇండియాలో కాజల్ తో ప్రేమలో పడ్డ నాగచైతన్య అనుకోని పరిస్దితుల్లో బ్యాంకాక్ లో అన్నయ్య దగ్గరికి వెళ్ళతాడని అక్కడనుండి కథ మలుపు తిరుగుతుందని అంటున్నారు. ప్రకాష్ రాజ్ విలన్ గా చేసే ఈ చిత్రంలో అన్నయ్య పాత్రపై క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుందని అదే హైలెట్ అవుతుందని, అందుకే ఆ పాత్రకు చాలా జాగ్రత్తగా ఎంపిక చేయాల్సివస్తోందని చెప్పుకుంటున్నారు. ఇక అజయ్ భుయాన్ రూపొందించిన హౌస్ ఫుల్ చిత్రం ఎవరూ కొనక ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. అలాగే ఈ చిత్రాన్ని శివప్రసాద్ రెడ్డి తమ కామాక్షి మూవీస్ ఎంటర్టైనర్ పతాకంపై రూపొందిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











