కన్నడ రీమేక్ కు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్?
మరో ప్రక్క నాగచైతన్య వరసగా రీమేక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తమిళంలో హిట్టైన వెట్టై ని సునీల్ తో కలిసి చేస్తున్నారు. అలాగే 'హలో బ్రదర్' చిత్రాన్ని మళ్లీ తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాగార్జున సినీ వారసుడు నాగచైతన్య ఈ చిత్రంలో నటించబోతున్నాడు. తండ్రి లాగే నాగచైతన్య కూడా ఇదే చిత్రం రీమేక్‌లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయబోతుండటం విశేషం.
అక్షయ్ కుమార్,కత్రినా కైఫ్ కాంబినేషన్ రూపొంది, ఘన విజయం సాధించిన 'వెల్‌కమ్'ను తెలుగులో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు మోహన్ బాబు (నానాపటేకర్ పాత్రలో), నాగచైతన్య(అక్షయ్‌కుమార్ కేరక్టర్‌లో) కలిసి నటించనున్నారు. ఈ ప్రాజెక్టుకు లక్ష్యం వాసు దర్శకత్వం వహిస్తారు.
తమిళ వెట్టై చిత్రం యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్ సమాహారంతో రూపొందింది. తెలుగు వెర్షన్ లో నాగచైతన్య,సునీల్ హీరోలుగా చేస్తున్నారు. మిగతా కీలక పాత్రల్లో... బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్, జయప్రకాష్‌రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్‌ప్లే: ఎ.దీపక్‌రాజ్, పాటలు: చంద్రబోస్, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications












