ప్రేమలో నాగచైతన్య-అంగీకారంలో నాగార్జున...!
అక్కినేని నాగార్జున ఇటీవల తన తనయుడు నాగచైతన్యకు ఓ లవర్ ఉందని ఓ సర్ ప్రైసింగ్ న్యూస్ ను ఇంటర్వ్యూలో చెప్పాడు. నాగ్ చైతన్య స్టడీస్ కోసం హైదరాబాద్ నుండి ముంబాయ్, చెన్నై వెళ్ళేవాడని, ఆ మద్యలో కొంత విషయం నాకు తెలిసిందన్నాడు. ఇప్పుడు ఏకంగా ఆ అమ్మాయి గురించిన వివరాలను కనుక్కున్నాడట. ఆ అమ్మాయి ముంబాయ్ అమ్మాయని, ఆమె బ్యాక్ గ్రౌండ్ చాలా మంచిది కావడంతో నాగచైతన్య, ఆ అమ్మాయి ప్రేమను అంగీకరించాలని నాగార్జున అనుకుంటున్నాడట. బహుశా తనది కూడా లవ్ మ్యారేజ్ కాబట్టి కొడుకు మనసును నాగార్జున అర్థం చేసుకున్నాడేమో..ఏదేమైనా తండ్రి ఇంత ఓపెన్ గా ఉన్నప్పటికీ నాగచైతన్య మాత్రం ఇంకా తన లవ్ మ్యాటర్ ని నాగార్జునకు చెప్పలేదని సమాచారం.
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య కథానాయ కుడిగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న భారీ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. హీరో నాగచైతన్య సరసన హీరోయిన్ తమన్నా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రంలోని కొన్ని స్టిల్స్ బయటికి వచ్చాయి.


Click it and Unblock the Notifications











