Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాట్ తమన్నా చుట్టూ 'ఐ లవ్ యు' అని తిరుగుతున్న నాగచైతన్య
నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'దటీజ్ మహాలక్ష్మి.." అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గీతా ఆర్ట్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆ టైటిల్ కాకుండా "ఐలవ్ యు" అనే టైటిల్ ని పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వినపడుతోంది. ఇక 'దటీజ్ మహాలక్ష్మి.." అనే టైటిల్ హీరోయిన్ ఓరియెంటెడ్ ఉందని నాగచైతన్య రిజెక్టు చేసినట్లు చెప్తున్నారు. నేటితరం యువతకు ప్రతినిథిలా నిలిచేలా నాగచైతన్య పాత్ర ఉంటుందని దర్శకుడు సుకుమార్ చెప్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఆర్య 2, జగడం చిత్రాలు ఫెయిల్యూర్ కావటంతో సుకుమార్ ఈ సినిమాని ఎలాగయినా సంచలన విజయం సాధించేలా హిట్ కొట్టాలని చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.