For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగచైతన్య కోసం మరో టాలెంట్ దర్శకుడు.. సమంత సలహాతో కొత్త ప్రాజెక్ట్!

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వేగంగా సినిమాలను లైన్ లో పెడుతున్న హీరోలలో నాగచైతన్య కూడా ఉన్నాడు. ఈ యువ హీరో ఒక విధంగా అక్కినేని హీరోల కంటే కూడా కాస్త స్పీడ్ గా వెళ్తున్నాడని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ ను కూడా అంతకంతకూ పెంచుకుంటూనే ఉన్నాడు. కథల ఎంపిక విషయంలో కూడా నాగచైతన్య ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటోంది. రొటీన్ దర్శకులతో కాకుండా కాస్త విభిన్నంగా ట్రై చేసే దర్శకులతో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు. నాగచైతన్య కోసం సమంత కూడా కథల విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ అయితే వస్తోంది.

  ఇక రీసెంట్ గా సమంత ద్వారానే మరొక కథను కూడా విన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. రీసెంట్ గా నాగ చైతన్య తండ్రి నాగార్జునతో ఒక సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే సోగ్గాడే చిన్ని నాయన కాంబినేషన్లో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా లో నాగచైతన్య ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే మరొక సినిమాను కూడా చేస్తున్నాడు. ఇక ఆ రెండు సినిమాల అనంతరం విజయ్ కనకమేడల అనే టాలెంటెడ్ దర్శకుడితో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

  Naga chaitanya new project with talented director

  విజయ్ కనకమేడల ఈ ఏడాది నాంది సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని కూడా రాబట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి విజయం కోసం ఎదురు చూస్తున్న నరేష్ కు ఆ సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది. దీంతో ఆ దర్శకుడు పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది నిర్మాతలు కూడా అతనికి ఆఫర్స్ బాగానే ఇస్తున్నారు. అయితే అతను తన తర్వాత సినిమాను నాగచైతన్య తో చేయబోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కథను మొదట సమంత విని నాగచైతన్యతో ఓకే చేయించినట్లు సమాచారం.

  చైతన్య కెరీర్ విషయంలో సమంత కూడా ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్నప్పుడు ఆమె తన సొంత నిర్ణయంతోనే మజిలి సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చింది. ఆ సినిమా విజయం తర్వాత నాగచైతన్య మార్కెట్ కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. శైలజ రెడ్డి అల్లుడు సినిమా కూడా భారీ ఓపెనింగ్స్ అందుకుంది అంటే అతని మార్కెట్ స్థాయి ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక విజయ్ దర్శకత్వంలో కూడా ఒక డిఫరెంట్ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

  అలాగే పరశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ముందుగానే కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ దర్శకుడు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అనంతరం నాగచైతన్యతో వర్క్ చేసే అవకాశం ఉంది. చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో నాగచైతన్య తన మార్కెట్ స్థాయిని మరింత పెంచుకోవటం పక్కా అని అర్థమవుతుంది. రొటీన్ సినిమాలను కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఎంతో కొంత డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఆ ప్లానింగ్స్ నాగచైతన్య కెరీర్ కు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.

  English summary
  Naga chaitanya new project with talented director
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X