»   » '100% లవ్‌' ఆడియోకి నాగచైతన్య ఎందుకు ఎగ్గొట్టాడు?

'100% లవ్‌' ఆడియోకి నాగచైతన్య ఎందుకు ఎగ్గొట్టాడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రీసెంట్ గా జరిగిన వంద శాతం ప్రేమ చిత్రం ఆడియో పంక్షన్ కి చిత్ర హీరో నాగచైతన్య హాజరు కాకపోవటం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. అయితే బ్యాంకాక్ లో ఓ పాట చిత్రీకరణలో ఉండి రాలేకపోయాడని అన్నారు. నిజంగా రావాలనుకుంటే ఇదేమీ పెద్ద అడ్డంకేమీ కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే నాగార్జున హాజరై కవర్ చేయటానకి ట్రై చేసాడు కానీ ఆ లోటు కనిపించిందంటున్నారు. ఇక అల్లు అర్జున్ హీరో యోమో ఈ చిత్రానికి అన్నట్లు ఆడియో పంక్షన్ వాతావరణం ఉందని, అది నాగ్ ప్యాన్స్ ని భాధించిందని అంటున్నారు. అయితే నాగచైతన్య మాత్రం వీడియో ద్వారా తన సందేశం పంపాడు.అందులో తొలిసారి 'పిల్లా నీ బావనిస్తవా?' అనే ఐటమ్ సాంగ్ ఇందులో చేశా. అది నా ఫేవరేట్ సాంగ్. దాన్ని రాజమండ్రిలో తీశారు. మిగతావన్నీ హైదరాబాద్‌లో తీశారు. సుకుమార్‌తో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఇది అందమైన ప్రేమకథ. ఇది 100% హిట్టవుతుంది అన్నాడు. అలాగే తన హీరోయిన్ తమన్నా నుంచి చాలా నేర్చుకున్నా అన్నాడు.ఇంతకీ ఏమి నేర్చుకున్నాడో ఏంటో..తమన్నా ఏమి నేర్పిందో.

English summary
Naga Chaitanya and Tamanna starrer love entertainer '100% Love' audio was launched at Rock Gardens in Hyderabad on Monday.Nagarjuna launched the audio and gave the first copies of the CDs to actors Ram and Allu Arjun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu