నాగచైతన్య ఔట్.. అల్లు శిరీష్ ఇన్?
అక్కినేని యువ హీరో నాగచైతన్య కోలీవుడ్ డైరెక్టర్ రాధా మోహన్ దర్శకత్వంలో 'గౌరవం' అనే చిత్రానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించి విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం నుంచి నాగ చైతన్య తప్పుకున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం రాధా మోహన్ 'గౌరవం' చిత్రం గురించి అఫీషియల్ ప్రకటన చేశారు. ఈ చిత్రంలో నాగచైతన్య, శరత్ కుమార్ తనయ వరలక్ష్మి నటిస్తారని చెప్పారు. కానీ పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తలను బట్టి కొన్ని కారణాల వల్ల నాగచైతన్య ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని, నాగచైతన్య స్థానంలో బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ ఎంపికైనట్లు సమాచారం.
'గౌరవం' చిత్రాన్ని డ్యూయెట్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తోంది. మే 16న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. 'అభియుమ్ నానుమ్' అనే తమిళ చిత్రానికి పని చేసి సినిమాటోగ్రాఫర్ ప్రీత ఈచిత్రానికి పని చేస్తున్నారు.
ప్రస్తుతం నాగ చైతన్య దేవా కట్ట దర్శకత్వంలో 'ఆటో నగర్ సూర్య' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రాన్ని ఆర్.ఆర్ మూవీ మేకర్స్, మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్, అచ్చిరెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎడిటింగ్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ నారోజ్


Click it and Unblock the Notifications











