'ఆటో నగర్ సూర్య' చిత్రంలో నాగచైతన్య సరసన ఆమెనే
నాగచైతన్య త్వరలో దేవకట్టా దర్శకత్వంలో ఆటో నగర్ సూర్య అనే టైటిల్ తో ఓ చిత్రం చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అతని సరసన అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారని సమాచారం. ఇక మొదట హీరోయిన్ గా సమంత, కాజల్, అమృతారావు వంటి పేర్లు వినిపించినప్పటికీ ఆమెనే ఫైనలైజ్ చేసారు. ఇక నిత్యామీనన్ మొదటి చిత్రంతోనే అందరి దృష్టిలోనూ పడింది. దాంతో ఆమెకు తెలుగు పరిశ్రమ నుంచి మంచి ఆఫర్సే వస్తున్నాయి. ఇక ఈ చిత్రం బెజవాడ నేఫధ్యంలో జరిగుతుందని ఓ మాస్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రూపొందించనున్నారని వినికిడి. ఇప్పటికే ఆటో నగర్ సూర్యగా దేవకట్టా విడుదల చేసిన ఆడియో టీజర్ అందరనీ ఆకట్టుకుంది. ఈ చిత్రం మార్చి నుంచి షూటింగ్ కి వెళ్ళనుంది. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.
నిత్యా మీనన్ నాగచైతన్య ప్రస్దానం అచ్చిరెడ్డి దేవకట్టా nithya menon naga chaitanya prashtnam deva katta


Click it and Unblock the Notifications